Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేట్లపాలెంపై పకృతి శాపం, పాపం అనిపించే వాస్తవాలు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన ఘోర బాణసంచా పేలుడు ఘటన యావత్ రాష్ట్రాన్ని కన్నీటిపర్యంతం చేస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల ఆశలు, ఆ గాలిలోనే కలిసిపోయాయి. కళ్లముందే కన్నవారు, కట్టుకున్నవారు అగ్నికీలల్లో ఆహుతైపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ గ్రామం విలవిలలాడుతోంది.

సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం వరకు అంతా మామూలుగానే ఉంది. కానీ, ఒక్కసారిగా సంభవించిన బాణసంచా పేలుడు ఆ ప్రాంతాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేసింది. పేలుడు ధాటికి గ్రామమంతా వణికిపోయింది, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. దట్టమైన పొగలు, మంటల మధ్య కార్మికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు వదలడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇంకా నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

Kakinada Firecracker Blast Tragedy Death Toll Rises to 23 as CM Chandrababu Naidu Visits Vetlapalem Victims

బురద పొలాలు.. అడ్డుపడ్డ అంబులెన్సులు..

ఈ ప్రమాదంలో ప్రకృతి కూడా బాధితులను వెక్కిరించింది. బాణసంచా తయారీ కేంద్రం జనవాసాలకు దూరంగా, వరి పొలాల మధ్య ఉండటంతో.. ప్రమాదం జరిగిన వెంటనే ఫైరింజన్లు, అంబులెన్సులు అక్కడికి చేరుకోలేకపోయాయి. పొలాలు బురదమయంగా ఉండటంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. దాదాపు రెండు గంటల పాటు బాణసంచా పేలుళ్లు కొనసాగుతూనే ఉండటంతో, ప్రాణాలు కాపాడేందుకు స్థానికులు కూడా వెళ్లలేకపోయారు. చివరకు వెళ్లేసరికి.. అక్కడ శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న భీతావహ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది.

లక్ష్యం ఒక్కటే.. బలి ఒక్కటే!

నివేదికల ప్రకారం, ఆరు షెడ్లలో బాణసంచా తయారీ జరుగుతోంది. ఈ పరిశ్రమకు లైసెన్స్ ఉన్నప్పటికీ, రక్షణ చర్యలు మాత్రం శూన్యమని స్థానికులు మండిపడుతున్నారు. పేలుడు సంభవించిన వెంటనే యజమాని పరారీలో ఉన్నట్లు ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. కొంతమంది కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే మృతుల సంఖ్య మరింత భయంకరంగా ఉండేదని తెలుస్తోంది.

బాధితుల్లో ఎవరున్నారు?

ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతున్న వారిలో వేట్లపాలెం వాసి కప్పా వెంకట లక్ష్మి, పెద్దాపురం వాసి మోర్తా శ్రీను, సామర్లకోటకు చెందిన కె. శ్రీను, చిటికెల లక్ష్మి ఉన్నారు. వీరి కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రి ప్రాంగణంలో గుండెలను పిండేస్తున్నాయి.

నేరుగా రంగంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు..

విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే తన పర్యటనను ముగించుకుని కాకినాడకు బయలుదేరారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, అనంతరం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

అమ్మేవాడికి లాభం.. తయారు చేసేవాడికి శాపం అన్నట్టుగా మారింది బాణసంచా తయారీ. సంక్రాంతి, పెళ్లిళ్ల సీజన్ కోసం టపాసులు తయారు చేస్తూ.. తమ జీవితాలనే టపాసుల్లా పేల్చుకుంటున్న ఈ నిరుపేదల బతుకులకు భరోసా ఎప్పుడు లభిస్తుందో? నిబంధనల ఉల్లంఘనతో ఇంకా ఎన్ని నిండు ప్రాణాలు గాలిలో కలవాలి?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+