'వైఎస్‌కు ఏనాడు ఆ ఆలోచన రాలేదు.. జగన్ డ్రామాలకు నవ్వొస్తుంది'
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి నిరోధకుడు జగన్' అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
విజయవాడ: రాష్ట్రంలో ప్రభుత్వం తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ అధినేత జగన్ అడ్డుకుంటున్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు మరింత పదును పెడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి నిరోధకుడు జగన్' అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం చంద్రబాబుపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రజా సమస్యల పట్ల జగన్ కు నిజంగా చిత్తశుద్దే గనుక ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వేరే మార్గాలున్నాయన్నారు.
వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు ఏనాడు రాలేదని, ఇప్పుడు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. దానికి జగన్ అడ్డుతగులుతున్నారని అన్నారు. జగన్ డ్రామాలు చూస్తుంటే నవ్వొస్తుందని ఈ సందర్బంగా కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి, అక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications