గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య ఘర్షణ, ఇద్దరి మృతి, చంద్రబాబు సమాధానం చెప్పాలన్న కరణం

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య మరోసారి ఫ్యాక్షన్ గొడవలు చోటుచేసుకొన్నాయి. ఈ ఇద్దరు కూడ ఒకే పార్టీలో ఉన్నారు.అయితే ఈ రెండు గ్రూపులను సమన్వయపర్చారు చంద్రబాబునాయుడు. అయితే శుక్రవారం రాత్రి ఈ రెండు గ్రూపులమద్య చోటుచేసుకొనన ఘర్షణల్లో రామకోటేశ్వర్ రావు, అంజయ్య అనే ఇద్దరు కరణం బలరాం వర్గీయులు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది.ఈ ఘర్షణలో రెండు వర్గాలు ఒకరిపై మరోకరు దాడులకు దిగారు.

karanam balaram, gottipati ravikumar

అయితే ఈ ఘటనలో బలరాం గ్రూపుకు చెందిన అంజయ్య, రామకోటేశ్వర్ రావులు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులను ఎమ్మెల్సీ కరణం బలరాం పరామర్శించారు.

బాబు ఏం సమాధానం చెబుతాడు

వైసీపీ నేతలను తీసుకువచ్చి మా నెత్తిన పెట్టాడని చంద్రబాబునాయుడిపై కరణం బలరాం తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.ఈ విషయమై బాబు ఏం సమాధానం చెబుతారో చూస్తా అని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

చట్టాన్ని చేతిలోకి తీసుకొంటే సహించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈ ఘటనకు భాద్యులైనవారిని అరెస్టు చేయాలని డిజిపిని ఆదేశించారు సిఎం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLA Karanam Balaram and MLa Gottipati Ravikumar groups attack each and other on Friday night. In this incident 2 people dead, five members injured.
Please Wait while comments are loading...