IPL ప్రారంభం వేళ కావ్య మారన్ బిగ్ ట్విస్ట్, ఏం జరుగుతోంది..!!
IPL 2026 SRH: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సారి ఐపీఎల్ లో SRH పైన భారీ అంచనాలు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ లో దుమ్ము లేపిన బ్యాటర్లు ఈ టీం లో ఉండటంతో... కొత్త లెక్కలు మొదలయ్యాయి. ఇదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్ స్టార్ బ్యాటర్ కు బాధ్యతలు అప్పగించేందుకు తుది కసరత్తు జరుగుతోంది.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ ఎవరనేది చర్చగా మారింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడంతో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. కమిన్స్ అందుబాటులో లేని పక్షంలో జట్టును నడిపించే బాధ్యతలు ఇషాన్ కిషన్ కు అప్పగించాలి SRH యాజమాన్యం భావిస్తోంది. 2025-26 యాషెస్ సిరీస్ సమయంలో పాట్ కమిన్స్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు మైదానంలోకి దిగలేదు. ఐపీఎల్ నాటికి ఆయన కోలుకుంటాడా లేదా అనే విషయంపై ఫ్రాంచైజీకి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలోనే ఇషాన్ కిషన్‌కు బాధ్యతలు అప్పగించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కమ్మిన్స్ స్థానంలో కెప్టెన్సీ పై తుది నిర్ణయం
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌ను కనబరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఫైనల్ లోనూ కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్.. కీలకమైన క్యాచులను పట్టి జట్టు ఛాంపియన్ కావటంలోనూ కీలకంగా వ్యవహరించాడు. కమ్మిన్స్ స్థానంలో తొలుత ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ తన సారథ్యంలో తొలిసారి ఝార్ఖండ్‌ను విజేతగా నిలిపాడు. 2016 అండర్ 19 ప్రపంచ కప్‌లోనూ కెప్టెన్‌గా ఉన్నాడు. భారత్ టీ20 ప్రపంచ కప్ నెగ్గడంలోనూ ఇషాన్ 317 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. కాగా అతడిని ఎస్ఆర్‌హెచ్ 2025 మెగా వేలంలో రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. మరో వైపు అభిషేక్ శర్మ కూడా 2016 అండర్ 19 ఆసియా కప్‌లో ఇండియాకు కెప్టెన్‌గా చేశాడు. దీంతో.. కెప్టెన్ ఖరారు పైన SRH యాజమాన్యం అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications