బావా! బామ్మర్ది అంటూ.. : చిరు, వపన్‌, జేపీపై కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి పవన్‌పై జేపీ చేసిన వ్యాఖ్యల ఉదహరిస్తూ.. తన బావమరిదికి సమాధానం చెబుతున్నట్లుగా చెబుతూనే పవన్ వ్యక్తిత్వంపై విమర్శలు గుప్పించారు.

పవన్‌ దేనిపైనా శ్రద్ధ పెట్టలేరని, స్టార్ట్ చేసింది ఫినిష్ చేసే సత్తా పవన్‌లో అస్సలు లేదంటూ ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్.

బావా.. బామ్మర్ది అంటూ..

కత్తి మహేశ్ ట్విట్టర్ వేదికగా.. ‘బావా! జేపీ గారు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సి మీద శ్రద్ధ చూపడం లేదని అంటాడేమిటి?" ‘‘బామ్మర్ది... పవన్ కళ్యాణ్‌కి దేని మీదా పర్మనెంటుగా శ్రద్ధ ఉండదని, స్టార్ట్ చేసింది, ఫినిష్ చేసే సత్తా అస్సలు ఉండదని, అనుభవమైతేగాని ఆయనకు తెలిసిరాలేదు. అంతే' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవే బెటర్ అనిపించదూ..

‘ఒక ఊరిలో ఒక వెధవ.బ్రతికుండగా,ఆడోళ్ళని నానా హింసాలూ పెట్టేవాడు.చచ్చేముందు కొడుకుతో,బ్రతకడం ఇట్టా బతికేసాను.చచ్చాకైనా నాకు మంచిపేరు తీసుకురా అన్నాడట. కొడుకు తండ్రికన్నా దారుణాలు చేసి, వీడికన్నా వీడి తండ్రే బెటర్ అనిపించాడంట. ఇప్పుడు చిరంజీవిని చూస్తే, బెటర్ అనిపించదూ మరీ!!!' అంటూ మరో ట్వీట్‌లో కత్తి వ్యాఖ్యానించారు.

ఏ తరహా సిద్ధాంతమో..

అంతకుముందు ‘బావా! జనసేన అంబేద్కర్ భావజాలంతో ఏర్పడింది అని వాళ్ళ కొత్త నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్ రావు అంటున్నారు. ఇదేదో కొత్తగా లేదూ! కొత్తగానే ఉంది బామ్మర్ది! అధికార కులమైన కాపులకు రిజర్వేషన్లు కావాలి. దళితులకు రిజర్వేషన్లు తీసేయాలి. అనేది ఏ తరహా అంబేద్కర్ సిద్దాంతామో నాకైతే తెలీదు' అంటూ కత్తి మహేష్ ఎద్దేవా చేశారు.

తీవ్రమైన కత్తి విమర్శలు

తీవ్రమైన కత్తి విమర్శలు

గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కత్తి మహేష్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, చేసిన విమర్శలు తీవ్రంగా ఉండటంతో మరి పవన్ అభిమానులు గానీ లేదా జనసేన నేతలుకత్తి మహేష్‌పైనా అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+