తలసాని ఇంటికి తొలుత కెసిఆర్, తర్వాత చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సనత్‌నగర్ శానససభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆయన ఇంటికి వచ్చారు. సోమవారం సాయంత్రం కెసిఆర్ తలసాని ఇంటికి వచ్చారు. ఆయన ఇంటి వద్ద ఫలహారం బండి ఊరేగింపును టెంకాయ కొట్టి ప్రారంభించారు.
సోమవారం ఉదయం తలసాని శ్రీనివాస యాదవ్ కెసిఆర్ నివాసానికి వెళ్లి తన ఇంటికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని కెసిఆర్ మన్నించారు. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసం తొలి వారంలో తలసాని తెరాసలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలసాని ఇంటికి వచ్చారు. తలసాని ఇంటి వద్ద కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై, హైదరాబాదులో గవర్నర్ అధికారాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిని ప్రశ్నిస్తూ తలసాని శ్రీనివాస యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

తలసాని శ్రీనివాస యాదవ్‌తో పాటు మరికొంత మంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ శానససభ్యులు, నాయకులు తెరాస వైపు చూస్తున్నట్లు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications