కెసిఆర్ అసలు విషయం: వినోద్, తప్పదని కమల్ ట్విస్ట్

తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలోని ఇరుసభలు తిరస్కరించాయని సీమాంధ్ర ప్రాంత నేతలు జాతీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ వారికి అసలు విషయాన్ని చెప్పారని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నూతన ఒరవడి సృష్టించుకుందామన్నారు.
తెలంగాణ బిల్లుపై ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయం చెప్పినట్లు సభాపతి అప్పుడే ప్రకటించారన్నారు. అసెంబ్లీలో తీర్మానం పేరిట వారు మోసం చేశారన్నారు. కుట్రలు చేయడం సీమాంధ్ర నేతలకు అలవాటే అన్నారు. ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన ఘనత కెసిఆర్‌దే అన్నారు.
2014లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలన్నారు. సీమాంధ్ర నాయకులు తమ హక్కులు, తమ ప్రజలకు కావాల్సినవి, వారి సమస్యల పరిష్కారానికి కావాల్సిన అంశాలను బిల్లులో పొందుపర్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదన్నారు.
బిజెపి వెనక్కి పోతుందనుకోను: పొన్నాల
తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ వెనక్కి పోతుందని తాను అనుకోవడం లేదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ పైన నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నది కాదని, నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నారన్నారు.
వచ్చే సభలోనైనా తప్పదు: కమల్ నాథ్
తెలంగాణ ముసాయిదా బిల్లును వచ్చే సభలోనైనా ప్రవేశ పెట్టక తప్పదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ ఢిల్లీలో అన్నారు. తెలంగాణ అంశం రెండు ప్రాంతాల భావోద్వేగాలకు సంబంధించిందని తెలిపారు. తెలంగాణ అంశం ఎంతో సున్నితమైనదని, జాగ్రత్త పరిష్కరించాల్సి అవసరముందని అన్నారు. తెలంగాణ అంశాన్ని కేవలం పార్లమెంటు మాత్రమే పరిష్కరించగలదని చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ గానీ, వచ్చే లోక్‌సభగానీ ఈ సమస్యను పరిష్కరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications