కేసీఆర్ నియంతలా, విజయనగరానికి చెందిన నీవే: పల్లె
హైదరాబాద్: విద్యార్థుల స్థానికతను నిర్దేశించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియంతలా వ్యవహరిస్తున్నారని, విజయనగరం నుండి వచ్చిన ఆయన తెలంగాణలో స్థానికుడైనప్పుడు.. అక్కడ చదువుతున్న విద్యార్థుల స్థానికతను ఎందుకు అంగీకరించరని ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శనివారం ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన బిల్లులో భాగంగానే ఉమ్మడి రాఝధాని ప్రాంతంలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతిలో ఉంచాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై కేసీఆర్ ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. పోలవరం అంశం నుండి గవర్నర్ పాలన వరకు ప్రతి దాంట్లో కేసీఆర్ ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు.

కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాదులో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కూడా ఉద్యమనాయకుడిలానే కేసీఆర్ ప్రవర్తిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఏదైనా విషయం మీద అభ్యంతరాలుంటే ప్రధానమంత్రితో అధికారికంగా మాట్లాడాలని, నోటికొచ్చినట్లు బయట మాట్లాడకూడదన్నారు. కేసీఆర్ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
ప్రతీదాన్ని రాద్ధాంతం చేస్తే తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మోడీని కేసీఆర్ నియంత అనడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుత రాజకీయాలలో కేసీఆర్‌ను మించిన నియంత ఎవరూ లేరన్నారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల అంశం, యుపీఏ సర్కారే విభజన బిల్లులో పొందుపరిచిందనిస, దాంతో మోడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. అన్నీ తెలిసి ఆనాడు సోనియాకు కేసీఆర్ ఎలా ధన్యవాదాలు తెలిపారో చెప్పాలన్నారు. చంద్రబాబుతో తెలంగాణ బీజేపీ కలిసిపోయిందన్న ఆరోపణల పైన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications