కెసిఆర్ కీలక నిర్ణయం: 30 మందితో అభివృద్ధి మండలి

హైదరాబాద్: కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు... కేంద్రంలో జాతీయ సలహా మండలి(ఎన్ఏసి) తరహాలో తెలంగాణకు తెలంగాణ అభివృద్ధి మండలి ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మండలి చైర్మన్‌గా ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ వ్యవహరిస్తారు.

కనీసం ముప్పై మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు ఉంటారు. విశ్వవిద్యాలయాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు.. ఇలా అందరికీ స్థానం కల్పిస్తారు. ఈ విషయమై ఆచార్య ఘంటా చక్రపాణి నివాసంలో శనివారం జరిగిన తెలంగాణ సంపాదకుల సమావేశంలో కెసిఆర్ దీనిని వెల్లడించారు.

 KCR planned advisory council

కాగా, తెలంగాణ ప్రభుత్వంలో పని చేయాలని ఆచార్య ఘంటా చక్రపాణి వద్ద కెసిఆర్ ప్రస్తావించారు. దీనికి ఘంటా సున్నితంగా తిరస్కరించారు. తనకు ఆసక్తి లేదని చెప్పారు. గతంలో సికింద్రాబాద్ లోకసభ టిక్కెట్ ఇస్తామని చెప్పగా ఆయన తిరస్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+