సోనియావల్లే, జగనే సిఎం: కెసిఆర్, గుసగుస (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆయనకు తాము మద్దతిస్తామని చెప్పారు. రాహుల్‌కు మద్దతిచ్చే వారిలో తామే ముందుంటామని చెప్పారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

సీమాంధ్రలో జగన్ పార్టీకి వందకు పైగా సీట్లు వస్తాయన్నారు. తెలంగాణలో తమ పార్టీకి తొంబైకి పైగా సీట్లు వస్తాయన్నారు. కాంగ్రెసు పార్టీకి ముప్పైకి మించి సీట్లు రావన్నారు. తెరాస ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్డీయేకు తాము ఎట్టి పరిస్థితుల్లోను మద్దతిచ్చే ప్రసక్తి లేదన్నారు. జంట నగరాల్లో తాము గణనీయంగా సీట్లు పెంచుకుంటామని చెప్పారు. దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లు తమవే అన్నారు.

సోనియా వల్లే తెలంగాణ వచ్చింది

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందని, ఆమె వల్లనే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ అన్నారు. రాహుల్ ప్రధాని అవుతారంటే తాము మద్దతిస్తామన్నారు. ఎన్డీయేకు మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఉద్యోగుల ఆప్షన్లకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో మాదే హవా

మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తాము అధిక స్థానాలను గెలుచుకోబోతున్నామని చెప్పారు. ఖమ్మంలో తాము అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టబోతున్నామన్నారు. క్యాంపులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదన్నారు. మద్దతు కోసం తాము ఇప్పటి వరకు ఎవరినీ సంప్రదించలేదని చెప్పారు. తమ పార్టీని చీల్చడం ఎవరి తరం కాదన్నారు.

పొన్నాల పిచ్చి ప్రయత్నాలు వద్దు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తన పిచ్చి ప్రయత్నాలను మానుకోవాలని కెసిఆర్ సూచించారు. పొన్నాల రాజకీయ బ్రోకరా లేక రాజకీయ వ్యభిచారా అని మండిపడ్డారు. తమది తెలంగాణవాదం అయితే కాంగ్రెసుది చిల్లర రాజకీయమన్నారు.

ముఖ్యమంత్రి ఎవరనేది...

తెలంగాణలో తెరాసకు పూర్తి మెజార్టీ వస్తుందన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అఎవరనేది శాసన సభా పక్షం నిర్ణయిస్తుందని చెప్పారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కోసం తాము ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. సీమాంధ్రలో జగన్‌కు వందకంటే తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

చంద్రబాబుది ముగిసిన కథ

టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది ముగిసిన కథ అని కెసిఆర్ అన్నారు. సీమాంధ్రలో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. ప్రజాప్రయోజనాల దృష్టా వివిధ సమస్యలపై పక్క రాష్ట్రాలతో కలిసి పని చేస్తామన్నారు. జగన్ అంటరాని వాడు కాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రాతో అనేక సమస్యలపై పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. చంద్రబాబు రెంటికి చెడ్డ రేవడి అవుతారన్నారు.

తెరాస మీటింగ్

తెరాస మీటింగ్

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృశ్యం.

తెరాస

తెరాస

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కెసిఆర్, కెకె తదితరులు.

తెరాస

తెరాస

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కెసిఆర్, కెకె తదితరుల ముచ్చట్లు.

తెరాస

తెరాస

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కెసిఆర్ చెవిలో ఏదో చెబుతున్న శ్రీనివాస్ గౌడ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+