వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్‌తో కెసిఆర్, భేటీల పర్వం: రాజధానిపై మావో జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR thanks to Pranab
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమవుతున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివకృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అంతకుముందు కెసిఆర్.. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌లతో భేటీ అయ్యారు.

కెసిఆర్ రాక కోసం భారీ ఏర్పాట్లు

కెసిఆర్ ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుండి శంషాబాద్‌కు విమానంలో వస్తారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా పంజాగుట్ట, సోమాజిగూడ, లక్డీకాపూల్ మీదుగా గన్ పార్కుకు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కాగా, అమరవీరుల స్థూపంపై పూలవర్షం కురిపించాలని తెరాస వర్గాలు భావిస్తున్నాయి.

ఢిల్లీలో భేటీల పర్వం

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, గంగా భవానీ, నాదెండ్ల మనోహర్‌లు భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం గంగా భవానీ మాట్లాడుతూ... బిసిలను కాపుల్లో చేర్చాలని కోరినట్లు తెలిపారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్‌తో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఆ తర్వాత డిగ్గీతో నాదెండ్ల భేటీ అయ్యారు.

ఎపికి రాజధానిని నిర్మించి ఇవ్వాలి: మావోయిస్టు ప్రతినిధి జగన్

తాము హైదరాబాదును ఉమ్మడి రాజధానికి అంగీకరించే ప్రసక్తి లేదని, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని నిర్మించి ఇవ్వాలని మావోయిస్టు ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఉండాలన్నారు. పోలవరం నిర్మాణాన్ని ఆపివేయాలని, గవర్నర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ప్రతి అమరవీరుని కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.

English summary
Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao on Monday met President Pranab Mukherjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X