• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ ది పెద్దమనసు .. ఔదార్యం గొప్పది .. కేసీఆర్ కు జగన్ కితాబు

|

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున సభలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. సభ ప్రారంభం కాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిఎం జగన్ ఎందుకు వెళ్లారని తెలుగు దేశం ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న సభలో కేసీఆర్ కు ప్రశంశల వర్షం కురిసే దాకా వెళ్ళింది. తాను వెళ్లకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేదని చెప్పిన జగన్ తాను చేసిన పనిని సంర్ధించుకుని మాట్లాడారు. ఇక కేసీఆర్ ఔదార్యం గొప్పదని చెప్పి సభా ముఖంగా ఆయన తెలంగాణా సీఎం కేసీఆర్ కు కితాబిచ్చారు.

సిఎం కెసిఆర్ ను ప్రశంసించిన ఏపీ సీఎం జగన్ ..

సిఎం కెసిఆర్ ను ప్రశంసించిన ఏపీ సీఎం జగన్ ..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళుతున్న జగన్ తన వైఖరిని సమర్థించుకుంటూనే తెలంగాణ సిఎం కెసిఆర్ ను ప్రశంసించారు. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కొనసాగించడానికి, తాను తెలంగాణకు వెళ్ళానన్నారు జగన్ . వాస్తవానికి గోదావరి నది నీటిని నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ప్రాజెక్టులకు మళ్లించనున్నట్లు కెసిఆర్ చెప్పారు , ఇది కేవలం తెలంగాణ జిల్లాలకు మాత్రమే కాకుండా, రాయలసీమకు మరియు మరో నాలుగు ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు మేలు చేకూర్చే నిర్ణయం కాబట్టి నేను కేసీఆర్ తో సఖ్యంగా ఉండాలని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు . అంతే కాదు కేసీఆర్ గొప్పవాడు, ఆయనది పెద్ద మనసు అని జగన్ ప్రశంసించారు.

సీఆర్ ఉదార స్వభావంగల నాయకుడని కితాబిచ్చిన జగన్

సీఆర్ ఉదార స్వభావంగల నాయకుడని కితాబిచ్చిన జగన్

ఏపీ రాష్ట్రప్రజల కోసం,ఏపీకి నీరు ఇవ్వటం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోవటానికి బదులుగా, ఏపీకి ఇప్పుడు మేలు జరుగుతుంది అని సంతోషించటానికి బదులుగా విమర్శలు చేస్తారా అని టీడీపీపై మండిపడ్డారు జగన్ . ఎగువ రాష్ట్రాలు ఒకదాని తరువాత ఒకటి ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నా, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారభించినా అప్పుడు టీడీపీ ఏం చేసిందని ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తుంది అని మండిప డ్డారు. ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ఉదార స్వభావంగల నాయకుడని ఏపీ అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. ఇక ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరిస్తామని చెప్పి కోర్టుల్లో తేల్చుకోవటానికి స్వస్థి చెప్తామని పేర్కొన్నారు జగన్ .

మన అవకాశాలను వదులుకుని పక్క వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదన్న చంద్రబాబు

మన అవకాశాలను వదులుకుని పక్క వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదన్న చంద్రబాబు

అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గతంలో జగన్ కెసిఆర్ ను హిట్లర్ అని పిలిచారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పాకిస్తాన్ అవుతుందని అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకు తిరగటంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు . నీటి వనరుల కేటాయింపు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పెద్ద సమస్య అని టిడిపి దీనికి పరిష్కారం చూపడానికి నిరంతరం ప్రయత్నించిందని పేర్కొన్నారు . మనకు సొంతంగా ఉన్న అవకాశాలను వదులుకుని పక్క వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదని చంద్రబాబు పేర్కొన్నాయి. ఇక దానికే జగన్ కేసీఆర్ ను మాగ్నానిమిటీ ని గురించి చెప్తూ అందరూ షాక్ అయ్యేలా పొగడ్తల వర్షం కురిపించారు .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The first day of Andhra Pradesh Assembly Budget sessions had a very interesting discussion. As the sessions started Telugu Desam MLAs questioned why CM Jagan went to Kaleshwaram Project's inauguration. In counter Jagan asked what was the previous TDP government doing when the project was started in their tenure. Jagan defended his stand going to Kaleshwaram's opening ceremony and praised Telangana CM KCR. "To maintain good relations with neighboring states, I did go to Telangana. In fact KCR has said that Godavari river water will be diverted to Nagarjuna sagar and Srisailam projects which can not only give water to just Telangana districts but also to Rayalaseema and four other districts in Andhra Pradesh. He was magnanimous," said Jagan. Instead of appreciating his efforts, we are fighting with him and upper states are building one project after another and we are just confining ourselves filing petitions in the courts where the solution is taking decades, stated Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more