బీజేపీ కూడా: కేసీఆర్ అసహనం, తెలంగాణXరైల్వేపోలీస్
హైదరాబాద్: రైల్వే బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేదని ఆయన అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.20 కోట్లు నిధులు సరిపోతాయా అన్నారు. కాంగ్రెసు పార్టీ లాగే బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు.

రెండో దశ ఎంఎంటీఎస్: శ్రీవాస్తవ
రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఏపీ, టీ రాష్ట్రాలకు చేకూరిన ప్రయోజనాల గురించి దక్షిణ మధ్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ విలేకరులకు వివరించారు. రైల్వే బడ్జెట్‌లో కొన్ని ప్రాజెక్టులు మనకు కేటాయించారన్నారు. తొమ్మిది హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాష్ట్రం మీదుగా రెండు వెళ్తాయని చెప్పారు. నాగపూర్ - సికింద్రాబాద్, చెన్నై - హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లు ఉన్నాయన్నారు. పెద్దపల్లి - నిజామాబాద్ మధ్య రైల్వే లైను త్వరలో పూర్తి చేస్తామన్నారు.
దక్షిణ మధ్య రైల్వేలో సౌకర్యులు మెరుగుపరుస్తామన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రత్యేక రైళ్ల కోటాలో తిరుపతి ఉంటుందని చెప్పారు. పెండింగులో ఉన్న 29 ప్రాజెక్టులకు ఇరవై వేల కోట్లు కేటాయించారన్నారు. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు అంత సులభం కాదన్నారు. అవసరాన్ని బట్టి కేంద్రం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులను త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు.
టీ పోలీస్ వర్సెస్ రైల్వే పోలీసులు
సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న 8 ఎకరాల భూమిపై కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రాజుకుంది. ఆ భూమి తమదంటే తమదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులు వాగ్వాదానికి దిగారు.
దీంతో తెలంగాణ అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించారు. ఈ పరిణామంతో రైల్వే పోలీసులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను రైల్వే పోలీసులు కూల్చేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో ఇరువర్గాల పోలీసులను ఉపసంహరించుకున్నారు.












Click it and Unblock the Notifications