ఆనందంగా ఓటేసిన కెసిఆర్, ఎంతసేపైనా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్/మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఆయన మెదక్ జిల్లా సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్యతో కలిసి వచ్చి ఆయన ఓటేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. పోలింగ్ సరళి సంతృప్తినిచ్చిందన్నారు. మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు కలెక్టర్ స్మితా అగర్వాల్ చక్కని ఏర్పాట్లు చేశారని కొనియాడారు. నూటికి నూరు శాతం తెరాస ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణలో ఓటు వేయడం గొప్ప అనుభూతి అన్నారు.

ఇష్టమైన సినిమా కోసం కూర్చుంటాం: పవన్
జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లో పవన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఇష్టమైన సినిమా కోసం చాలామంది ఎంతసేపైనా క్యూలో నిల్చుంటారని, కూర్చుంటారని.. అలాంటిది భవిష్యత్తును నిర్దేశించే ఓటును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. క్యూ లైన్ ఉన్నప్పటికీ భవిష్యత్తును నిర్దేశించే ఓటును వేయాలన్నారు. ఓటు వేయడం ఓ బాధ్యత అన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకుంటే మనమే ఇబ్బందులు పడతామన్నారు.












Click it and Unblock the Notifications