కర్నూల్‌కు ఇక మంచిరోజులు: కేఈ పండుగ సంబరం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కర్నూలును ఆర్థిక రాజధాని చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాకు ఇకపై మంచి రోజులు రానున్నాయన్నారు. అధునాతన పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించిన రైతులకు ప్రశంసా పత్రాలు, పది వేల రూపాయల నగదును అందించారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ధాన్యాలు, కూరగాయల స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వేకువజామునే చిన్నా, పెద్దా అందరూ కలిసి వెచ్చని భోగిమంటల్లో చలికాచుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తప్పిటగుళ్లు, పులివేశాలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలతో కుర్రకారు ఉరకేలయగా, కోలాటాలు ఆడుతూ తరుణీమణులు ఉర్రూతలూగించారు. పిల్లలకు సఖల సౌభాగ్యాలు కలగాలని పెద్దవారు ఆశీర్వచనం చేస్తూ పెద్దవారు భోగిపళ్లు పోశారు.
విజయవాడలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పల్లె వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. కోడిపందాలు, ఎడ్ల పందాలతో పాటు వంటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని తెలిపారు.












Click it and Unblock the Notifications