కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు టిడిపిలో రెండుచోట్ల బుట్టా రేణుక చిచ్చు: కేఈ ఆందోళన, గైర్హాజరీపై ఇలా

కర్నూలు లోకసభ సభ్యురాలు బుట్టా రేణుక వైసిపి నుంచి తమ పార్టీలో చేరడాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం చెప్పారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు లోకసభ సభ్యురాలు బుట్టా రేణుక వైసిపి నుంచి తమ పార్టీలో చేరడాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం చెప్పారు.

వైసిపిలో ఏం జరుగుతుందో తెలియట్లేదు: బుట్టా రేణుక, 'వారికి టిడిపిలో చేరాలని ఉన్నా'వైసిపిలో ఏం జరుగుతుందో తెలియట్లేదు: బుట్టా రేణుక, 'వారికి టిడిపిలో చేరాలని ఉన్నా'

Recommended Video

సీఎం ఇంటికి చేరిన బుట్టా రేణుక వీడియో | Oneindia Telugu

నియోజకవర్గంలో ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల ఆమెతో పాటు తాను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లలేకపోయానని చెప్పారు.

జగన్ తేల్చలేకపోయారా: బుట్టా రేణుక కౌంటర్లు, ట్విస్ట్.. బాబుకూ ఝలక్ ఇచ్చారుజగన్ తేల్చలేకపోయారా: బుట్టా రేణుక కౌంటర్లు, ట్విస్ట్.. బాబుకూ ఝలక్ ఇచ్చారు

 చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు

చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారు ఎవరైనా పార్టీలో చేర్చుకుంటామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. తమ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా తాము అందరం దానిని పాటిస్తామని, అదే విషయం తాను మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు.

కేఈ కృష్ణమూర్తి అలక అని ప్రచారం

కేఈ కృష్ణమూర్తి అలక అని ప్రచారం

కేఈ కృష్ణమూర్తి అలక అని ప్రచారంబుట్టా రేణుక టిడిపిలో చేరడంపై కేఈ కృష్ణమూర్తి అలకవహించారని ప్రచారం జరిగింది. ఆమె చేరికను కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేతలు జీర్ణించుకోలేకపోతున్నాని, అందుకే కేఈ కృష్ణమూర్తి ఆమె అనుచరుల చేరిక కార్యక్రమానికి హాజరు కాలేదనే వాదనలు వినిపించాయి.

కేఈ ప్రభాకర్ గుర్రు

కేఈ ప్రభాకర్ గుర్రు

సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటుపై కేఈ ప్రభాకర్ కన్నేశారని, ఇలాంటి పరిస్థితుల్లో బుట్టా చేరిక అంశంపై చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన కేఈ ప్రభాకర్‌కు.. ఇప్పుడు బుట్టా రేణుక చేరికతో వచ్చే ఎన్నికల్లోను అదే పరిస్థితి పునరావృతం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

 కేఈ ప్రభాకర్ పరిస్థితి ఏమిటి?

కేఈ ప్రభాకర్ పరిస్థితి ఏమిటి?

కేఈ ప్రభాకర్ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. బీటీ నాయుడుకు అప్పుడు సీటు ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ అది కూడా నెరవేరలేదు. దీంతో పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని టిడిపి కార్యాలయం ముందే కేఈ ప్రభాకర్ ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఆయనకు ఏపీఐడీసీ చైర్మన్ పదవి లభించింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయన ఆందోళన చెందుతున్నారు. బుట్టా రేణుక చేరిక నేపథ్యంలో ఆయనకు తాజా పరిణామాలు మింగుడుపడటం లేదు.

 బుట్టా రేణుక అనుచరుడు కొత్తకోట చేరికపైనా ఆగ్రహం

బుట్టా రేణుక అనుచరుడు కొత్తకోట చేరికపైనా ఆగ్రహం

బుట్టా రేణుక అనుచరులు మంగళవారం టిడిపిలో చేరారు. అందులో భాగంగా కొడుమూరు నియోజకవర్గంలో కొత్తకోట ప్రకాశ్ రెడ్డి టిడిపిలో చేరారు. కొత్తకోట చేరికపై విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. మొదటి నుంచి ఉప్పునిప్పుగా ఉన్న కొత్తకోట - విష్ణు వర్గాల మధ్య ఈ పరిణామాలు మరింత దుమారం రేపనున్నాయని అంటున్నారు.

బుట్టా రేణుకకు ఫోన్ల బెడద

బుట్టా రేణుకకు ఫోన్ల బెడద

బుట్టా రేణుక టిడిపిలో చేరిన అనంతరం ఆమెకు పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయట. వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట.

జగన్ పైన కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం

జగన్ పైన కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం

బుట్టా రేణుక చేరికపై కేఈ కుటుంబం అసంతృప్తి అనే ప్రచారం నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఆమె చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఆయన జగన్ పైన మండిపడ్డారు. బీసీలను ఏనాడు పట్టించుకోని వైసిపి అధినేత వైయస్ జగన్ ఇఫ్పుడు వారి గురించి మాట్లాడుతున్నారన్నారు. జ‌గ‌న్ గ్రామాల్లోకి వస్తే ప్రజలు నిలదీయాలన్నారు. మూడేళ్లుగా బీసీల గురించి మాట్లాడ‌ని జ‌గ‌న్‌కి ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారన్నారు.

English summary
Telugu Desam Party leader and Deputy Chief Minister KE Krishnamurthy welcomed Kurnool MP Butta Renuka joining in Telugu Desam on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X