చంద్రబాబుతో మనస్పర్థలు నిజమే, కానీ, అందుకే టీడీపీలో: కేఈ ప్రభాకర్

Subscribe to Oneindia Telugu

తమకూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సోదరుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వని కారణంగానే ఇలా జరిగిందన్నారు.

కర్ణాటకలోని తమకూరు జిల్లా పావగడలో శనీశ్వర ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడారు. అయితే, తనకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్(ఏపీఐడీ) బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని కేఈ ప్రభావకర్ స్పష్టం చేశారు.

ke prabhakar souring with Chandrababu

అందువల్లే తాను టీడీపీలో కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా, తన తమ్ముడు కేఈ ప్రభాకర్ కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించలేదని కృష్ణమూర్తి సీఎంపై ఇప్పటికే కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ ఫ్యామిలీకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి, తన తమ్ముడికి మాత్రం టికెట్ ఎందుకివ్వలేదంటూ అలకబూనారు. అంతేగాక, వచ్చే ఎన్నికల్లోనైనా కర్నూలు ఎంపీ టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే జిల్లాలో టీడీపీ గెలుస్తుందని తేల్చి చెప్పడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Telugudesam leader KE Prabhakar souring with Andhra Pradesh CM Chandrababu Naidu.
Please Wait while comments are loading...