'తెగించిన మూర్ఖుడు, జగన్‌ను భరించలేక ఢిల్లీకి వెళ్లిన ప్రశాంత్ కిషోర్'

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: వైసిపి అధినేత జగన్‌ను భరించలేక ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీకి వెళ్లిపోయారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం ఎద్దేవా చేశారు.

దగ్గుబాటీ! ఏ పార్టీ తరఫున, రాజకీయ నిరుద్యోగి, బాబు నీకూ నీళ్లిచ్చారు: దేవినేని

జగన్ గురించి ప్రజలకు తెలుసు

జగన్ గురించి ప్రజలకు తెలుసు

జగన్ గురించి ప్రజలకు బాగా తెలుసునని కేఈ కృష్ణమూర్తి అన్నారు. తనకు మీడియా, పత్రిక లేదని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. ఎన్నికలు అంటే జగన్‌కు గౌరవం లేనట్లుగా కనిపిస్తోందని మండిపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ భరించలేక ఢిల్లీకి

ప్రశాంత్ కిషోర్ భరించలేక ఢిల్లీకి

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ భరించలేకపోయాడని, అందుకే ఢిల్లీకి వెళ్లిపోయారని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రెఫరెండం కాదు.. సవాల్

రెఫరెండం కాదు.. సవాల్

ఉప ఎన్నికలను తాము రెఫరెండంగా తీసుకోవడం లేదని, సవాల్‌గా తీసుకున్నామని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. తనకు ఆస్తులు లేవని చెబుతున్న జగన్.. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు ఎవరివో చెప్పాలని ప్రశ్నించారు.

జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

వైయస్ జగన్‌ను జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈసీ నోటీసులు ఇచ్చినా జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

అన్నింటికి తెగించిన మూర్ఖుడు

అన్నింటికి తెగించిన మూర్ఖుడు

జగన్ అన్నింటికి తెగించిన మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని పత్తిపాటి నిప్పులు చెరిగారు. 12 కేసుల్లో ముద్దాయిని అయిన తనను ఎవరూ ఏం చేయలేరని, తనను ఎవరేం చేస్తారులే అన్న రీతిలో మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పట్ల అగౌరవంతో మాట్లాడటం సరికాదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and Deputy Chief Minister KE Krishna Murthy on Friday said that Prashan Kishore went to New Delhi with YS Jaganmohan Reddy's behaviour.
Please Wait while comments are loading...