వందల కోట్లు దోచుకున్న వెల్లంపల్లి అన్న కేశినేని నానీ .. నువ్వే గంజదొంగ అంటూ వెల్లంపల్లి ఫైర్

టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నా మొన్నటి దాకా పంచాయతీ ఎన్నికల పంచాయితీ కొనసాగగా ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎన్నికల పోరు కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎన్నికల రంగంలోకి దిగి ప్రచారాలను మొదలు పెట్టారు .ఈ సందర్భంగా అధికార పార్టీ తప్పులను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షం , రాతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతల విమర్శలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి .

దుర్గగుడి అవినీతి కేసులో అసలు దోషి వెల్లంపల్లి : కేశినేని నాని

దుర్గగుడి అవినీతి కేసులో అసలు దోషి వెల్లంపల్లి : కేశినేని నాని

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిలో జరిగిన అవినీతి కేసులో అసలు దోషి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలు గుప్పించారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని వందల కోట్లు దోచుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కనకదుర్గ అమ్మవారి సంపదను దోచుకున్న వైనంపై సిబిఐతో విచారణ జరిపించాలని కేశినేని డిమాండ్ చేశారు.

నానీ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్

నానీ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్

ఇదే సమయంలో కేశినేని నానీ వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్ దోచుకోవడం దాచుకోవడం టీడీపీ నేతలకు తెలిసినంతగా తమకు తెలియదన్నారు. అధికారంలో ఉన్న సమయంలో దోచుకో దాచుకో అనే విధంగా టిడిపి నేతలు వ్యవహరించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.కార్మికుల జీతాలు ఎగ్గొట్టిన కేశినేని నానికి తనను విమర్శించే హక్కు లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

నాని పెద్ద గజదొంగ అంటూ ఫైర్

నాని పెద్ద గజదొంగ అంటూ ఫైర్

రైల్వే రిజర్వేషన్ స్థలాలను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని వెల్లడించారు .ఆయన రైల్వే స్థలం పై కేంద్ర రైల్వే మంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా లేఖ రాశారని స్పష్టం చేశారు. కేశినేని నాని ఇప్పుడు విజయవాడ మేయర్ గా కూతుర్ని చేయాలని తెగ ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు . కేశినేని నాని పెద్ద గజదొంగ అని నిప్పులు చెరిగిన వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేది వైసిపినేనని, మేయర్ పీఠాన్ని దక్కించుకునేది వైసిపినేనని పేర్కొన్నారు.


కేశినేని నానీ వంటి గజ దొంగలను విజయవాడ ప్రజలు ఆదరించరని విమర్శించారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+