విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశినేనికి మరో చిక్కు!: ఆఫీసుల ముందు ఉద్యోగుల ధర్నా, రోడ్డున పడ్డామని!

మూసివేత విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయడంతో.. ఆ సంస్థ ఉద్యోగులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న పలానా ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడటంతో వారంతా కేశినేని ట్రావెల్స్ కార్యాలయాల ముందు నిరసనకు దిగారు.

చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కేశినేని ఆఫీసుల ముందు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. తమకు చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించకుండా అర్థాంతరంగా సంస్థను మూసివేయడంపై వారు మండిపడుతున్నారు.

<strong>కేశినేని అనూహ్య నిర్ణయం: 'ట్రావెల్స్' మూసివేత, గొడవ జరిగిన వారానికి!</strong>కేశినేని అనూహ్య నిర్ణయం: 'ట్రావెల్స్' మూసివేత, గొడవ జరిగిన వారానికి!

 Kesineni employees protest infront of kesineni transport offices

మూసివేత విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేతనంతో పాటు తమకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కేశినేని ట్రావెల్స్ యజమాని నాని మాత్రం దీనిపై స్పందించలేదు.

కాగా, నష్టాల కారణంగానే సంస్థను మూసివేయాల్సి వచ్చిందని కేశినేని యాజమాన్యం ప్రకటించింది. కేశినేని సంస్థలో మొత్తం 164బస్సులు ఉండగా.. వివిధ మార్గాల్లో నిత్యం ఇవి ప్రయాణిస్తుంటాయి. ఇదిలా ఉంటే, విజయవాడ ఆర్టీవోతో గొడవ జరిగిన సరిగ్గా వారం రోజులకే కేశినేని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

English summary
The MP is upset over repeated accusations that the private travels mafia is pulling the strings. So, he has decided to quit the transport business with a sole objective that his business interests should not bring disgrace to the party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X