ఉద్యోగులకు తీపికబురు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురునందిస్తూ.. 2017-2018 మార్చి 31 వరకు 2.096 శాతం డీఏ చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కాగా, ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1048.60కోట్ల భారం పడనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత మార్చి 8న బడ్జెట్ ప్రవేశపెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.

వివిధ సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థకు రూ.1,244 కోట్లు పరిపాలన అనుమతులకు ఆమోద ముద్ర వేసింది. అవినీతి నిరోధక శాఖలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25పోస్టుల మంజూరుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.












Click it and Unblock the Notifications