లోకేష్‌కు కీలక పదవి, అమరావతిలో 'మహానాడు'!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌గా ఉన్నారు. పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా మంగళవారం నైపుణ్యాల అభివృద్ధి కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

త్వరలో అన్ని జిల్లాల్లోను వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మహానాడులో ఆయనకు ఏదైనా కీలక బాధ్యత అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. లోకేష్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారనే ఊహాగానాలు గతంలోనే వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ పదవే ఇస్తారా మరేదైనా కీలకమైన పదవి ఇస్తారా అనే ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.

Key post to Nara Lokesh in TDP

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును రాజధాని ప్రాంతమైన అమరావతిలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన తర్వాత, సార్వత్రిక ఎన్నికల అనంతరం నిర్వహించిన తొలి మహానాడు హైదరాబాదులో నిర్వహించారు. ఇప్పుడు అమరావతిలో నిర్వహించవచ్చునని అంటున్నారు. ఈ సమయంలోనే నారా లోకేష్ పదవిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+