హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలుడు సేఫ్: కిడ్నాపర్లను పట్టించిన ఒక్క ఎస్ఎంఎస్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం సృష్టించిన ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్‌స మిస్టరీకి పోలీసులు గంటల వ్యవధిలోనే తెర దింపారు. ఎంతో సమయస్పూర్తితో, చాకచక్యంగా రంగంలో దిగిన పోలీసులు కేవలం ఒకే ఒక్క ఎస్‌ఎంఎస్ సాయంతో నిందితులను పట్టుకున్నారు.

బాలుడ్ని కిడ్నాప్ చేసి, అడ్డదారిలో లక్షలాది రూపాయలు చేజిక్కించుకోవాలని ఆశపడ్డ ఐదుగురు నిందితులు కటకటాలపాలయ్యారు. టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు సమష్టిగా నిర్వహించిన ఈ ఆపరేషన్ తాలుకూ వివరాలు బుధవారం సెంట్రల్ జోన్ డిపిసి కమలాసన్‌రెడ్డి మీడియాకు తెలిపారు. హిమాయత్‌నగర్ మూడో వీధిలో నివసించే ఎల్ నరేందర్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతని కొడుకు సంజిత్(8) నారాయణగూడ వెంకటేశ్వరకాలనీలోని ట్యూషన్‌కు వెళ్తుండగా నిందితులు కిడ్నాప్ చేశారు.

తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు చేయటంతో వారు ప్రత్యేక బృందాలుగా రంగంలో దిగారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఫుటేజీ సహాయంతో తొమ్మిదిన్నర గంటల సమయంలో పోలీసులు ఐదు బృందాలుగా నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అనుమానిత ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయితే అర్థరాత్రి 12గంటలు దాటిన తర్వాత దుండగుల నుంచి బాలుడి తండ్రి నరేందర్‌కు రూ. 50లక్షలు డిమాండ్ చేస్తూ ఓ ఎస్‌ఎంఎస్ వచ్చింది.

అప్పటి వరకు బలమైన ఆధారం లేని పోలీసుల ఆ ఎస్‌ఎంఎస్‌ను అస్త్రంగా మలుచుకుని నిందితుల కోసం తమ వేటను మరింత ముమ్మరం చేశారు. కిడ్నాప్ చేసిన బాలుడ్ని నెలరోజుల నుంచి నివాసముంటున్న బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేటలోని ఓ ఇంట్లో దాచి పెట్టారు. కాగా, పోలీసులు బుధవారం ఉదయం పంజాగుట్ట మోడల్ హౌజ్ వద్ధ నిందితులను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా, బాలుడి ఆచూకీ తెలిసింది.

నిందితులు

నిందితులు

నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం సృష్టించిన ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్‌స మిస్టరీకి పోలీసులు గంటల వ్యవధిలోనే తెర దింపారు.

బాలుడి తల్లిదండ్రులు

బాలుడి తల్లిదండ్రులు

ఎంతో సమయస్పూర్తితో, చాకచక్యంగా రంగంలో దిగిన పోలీసులు కేవలం ఒకే ఒక్క ఎస్‌ఎంఎస్ సాయంతో నిందితులను పట్టుకున్నారు.

నిందితులు

నిందితులు

బాలుడ్ని కిడ్నాప్ చేసి, అడ్డదారిలో లక్షలాది రూపాయలు చేజిక్కించుకోవాలని ఆశపడ్డ ఐదుగురు నిందితులు కటకటాలపాలయ్యారు.

వివరాలు తెలుపుతూ..

వివరాలు తెలుపుతూ..

టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు సమష్టిగా నిర్వహించిన ఈ ఆపరేషన్ తాలుకూ వివరాలు బుధవారం సెంట్రల్ జోన్ డిపిసి కమలాసన్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

బాలుడు సేఫ్

బాలుడు సేఫ్

హిమాయత్‌నగర్ మూడో వీధిలో నివసించే ఎల్ నరేందర్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతని కొడుకు సంజిత్(8) నారాయణగూడ వెంకటేశ్వరకాలనీలోని ట్యూషన్‌కు వెళ్తుండగా నిందితులు కిడ్నాప్ చేశారు.

ప్రధాన నిందితుడైన మహబూబ్‌నగర్ జడ్చర్లకు చెందిన విజయ్‌కుమార్(28) ఆరు సంవత్సరాల క్రితం నరేందర్ మెడికల్ షాప్‌లో బాయ్‌గా పనిచేసి ప్రస్తుతం సినిమా రంగంలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జూనియర్ ఆర్టిస్టుగా పరిచయమైన చిత్తూరుకు చెందిన హరిత(36) అనే మహిళతో సానిహిత్యం పెంచుకున్న నిందితుడు విజయ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో తేలికగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో సంజిత్ కిడ్నాప్‌కు ప్రణాళిక సిద్ధం చేశాడు.

ఆపరేషన్‌లో భాగస్వామి అయితే ఒక్కొక్కరికి రూ. 20వేలు ఇస్తానని చెప్పి హేమంత్‌కుమార్(22), స్వాతి(18), ఆటోడ్రైవర్ సయ్యద్ మున్నాను జత కలుపుకున్నారు. గత మూడు రోజులుగా సంజిత్ ట్యాషన్‌కు వెళ్లే ప్రాంతంలో రెక్కీ కూడా నిర్వహించి, మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసి, పారిపోగా, కిడ్నాప్‌కు గురైన బాలుడి సోదరుడు సన్విత్(12) పరుగు పరుగున వచ్చి విషయం తండ్రికి చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కాగా, కిడ్నాప్ ఛేదనలో ఆబిడ్స్ ఏసిపి రాఘవేందర్‌రెడ్డితో పాటు నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భీంరెడ్డి, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

English summary
The city police detected a case of kidnapping of a nine-year-old boy for ransom here today and arrested five members of a gang, including two junior artistes working in Telugu movies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X