మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్

ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025లో తన మంత్రముగ్ధమైన కళ్లతో, అమాయకపు చిరునవ్వుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన 18 ఏళ్ల ఇంటర్నెట్ సెన్సేషన్ మోనాలిసా భోంస్లే జీవితం ఇప్పుడు ఒక అనూహ్య మలుపు తిరిగింది. కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిన ఈ అందాల సుందరి, ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మలయాళ చిత్రసీమలో 'నాగమ్మ' చిత్రంతో అడుగుపెడుతున్న ఆమె, షూటింగ్‌లో ఉండగా ఈ వివాదం తలెత్తింది. తన ప్రేమను వ్యతిరేకిస్తున్న తండ్రిని ఎదిరించి, రక్షణ కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది.

గత ఏడాదిన్నరగా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో మోనాలిసా ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడగా, అది కాస్తా డేటింగ్‌కు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి హుటాహుటిన కేరళ చేరుకుని, ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, తన తండ్రితో కలిసి వెళ్లడానికి నిరాకరించిన మోనాలిసా, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని భావించి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Kumbh Mela Star Monalisa Bhonsle Files Police Complaint in Kerala for Protection With Her Facebook Lover

ఈ సాయంత్రమే Monalisa పెళ్లి..

తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందుకు వచ్చిన ఆమె, తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. తన మేజర్ హోదాను ఉపయోగించి తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు కేరళ పోలీసులు భద్రత కల్పిస్తుండటం విశేషం. కాగా ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలోని ఒక ఆలయంలో తన ప్రియుడిని వివాహం చేసుకోబోతోంది.

Monalisa వరుస సినిమాలు..

మోనాలిసా ప్రస్థానం ఒక అద్భుతమైన సినీ కథను తలపిస్తుంది. కుంభమేళాలో సామాన్యంగా కనిపించిన ఈ అమ్మాయి వీడియోలు వైరల్ కావడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే సనోజ్ మిశ్రా దర్శకత్వంలో 'ది డైరీ ఆఫ్ మణిపూర్' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఆమె, 'దిల్ జానియా' అనే మ్యూజిక్ వీడియోతో మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో కూడా సాయి చరణ్ సరసన 'లైఫ్' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా లాంచ్ అవుతోంది. కెరీర్ పరంగా ఎదుగుతున్న ఈ తరుణంలో ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుతున్న వివాదాలు చర్చలకు దారితీస్తున్నాయి.

Monalisa కెరీర్‌పై ఎలాంటి ప్రభావం?

ప్రస్తుతం తంపనూర్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లతో, పెద్ద బ్రాండ్లకు అంబాసిడర్‌గా మారుతున్న తరుణంలో.. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. తన ప్రేమ కోసం కుటుంబాన్ని కాదని మోనాలిసా తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉత్కంఠభరిత ప్రేమ కథా క్లైమాక్స్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+