కిల్లర్ జేబ్రాండ్స్ పేరుతో టీడీపీ వెబ్ సైట్; మద్యం మాఫియాపై టీడీపీ డిజిటల్ క్యాంపెయిన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న వరుస మరణాల తర్వాత ఏపీ లో కల్తీ నాటుసారా, ఏపీ మద్యం పై తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో జె బ్రాండ్ లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించాలని, కల్తీ నాటుసారా విక్రయాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలలోనూ ప్రధానంగా ఇదే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారుతుందని, మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఏపీలో సొంత బ్రాండ్ మద్యాన్ని విక్రయిస్తున్నారు అని, ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది.

కిల్లర్ జే బ్రాండ్స్ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించిన టీడీపీ
ఈ క్రమంలో తాజాగా మద్యం మాఫియాపై టిడిపి పోరులో భాగంగా సామాజిక మాధ్యమాల ద్వారా డిజిటల్ క్యాంపైన్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. నాటుసారా నిర్మూలించాలని, ప్రభుత్వ దుకాణాలలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మద్యం మాఫియా పై ప్రత్యేకమైన వెబ్ సైట్ ను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. www.killerjbrands.com పేరుతో తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ ను ప్రారంభించింది.

వెబ్ సైట్ లో మద్యం మరణాలు, ఏపీలో ,మద్యం మాఫియాపై వివరాలు
మద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడి, మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాలు తదితర వివరాలను వెబ్ సైట్ లో ఉంచుతామని, రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ సూచిస్తుంది. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న నేపథ్యంలో బాధితులు ఫిర్యాదు చేయాలనుకుంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని టిడిపి నేత నక్కా ఆనందబాబు వెల్లడించారు.

ఏపీలో మద్యం బ్రాండ్లు .. రిపోర్టులు, మరణాలపై వెబ్ సైట్ లో డేటా
మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దశల వారీగా మద్యం అమ్మకాలను పెంచుకుంటూ పోతున్నారు అంటూ టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టిన టీడీపీ మద్యం విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతున్న మద్యం బ్రాండ్ లు, ఆ మద్యం బ్రాండ్లలో ఉన్న హానికరమైన రసాయనాలకు సంబంధించిన రిపోర్టులను కూడా వెబ్ సైట్ లో పొందుపరుస్తూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.

మద్యం మాఫియా పరిణామక్రమం ఎలా జరిగిందో వెబ్ సైట్ లో వివరణ
అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మాఫియా పరిణామక్రమం ఎలా జరిగింది అనేది తెలియజేస్తూ చార్ట్ లను కూడా వెబ్ సైట్ లో పొందుపరచిన తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 70 లోకల్ లిక్కర్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని, వీటి వల్ల దాదాపు ఐదువేల మరణాలు సంభవించాయని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. మద్యం వ్యాపారంలోకి జగన్ నేరుగా ప్రవేశించి లిక్కర్ మాఫియాను ముందుకు నడిపిస్తున్నారు అంటూ వెబ్ సైట్ ద్వారా టిడిపి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మద్యం వల్ల మరణించిన వారి ఫోటోలను కూడా వెబ్ సైట్ లో ఉంచి ఏపీ మద్యం పై వినూత్న రీతిలో సమర శంఖారావం పూరించింది తెలుగుదేశం పార్టీ.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications