కిరణ్‌కు పదిలక్షల చందా ఇస్తా, సత్తా తెలుస్తుంది: డిఎల్

సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై ఆయన కడప జిల్లా ఖాజీపేటలో స్పందించారు. తాను కిరణ్ పార్టీకి పది లక్షల రూపాయల చందా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయన పార్టీ పెడితే ఎంత గొప్పవాడో తెలుస్తుందన్నారు.
అలాగే ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఎంత సేవ చేశాడో అర్థమవుతుందన్నారు. కిరణ్ ఎవరినీ నమ్మరని, అతనిని కూడా ఎవరు నమ్మడం లేదన్నారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రికి కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ఆయన ఇంకా సిఎంగా కొనసాగడం సరికాదన్నారు. కిరణ్‌కు పరిపాలన పైన అవగాహన లేదన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖలో మార్పులు తెచ్చి ప్రజలకు మేలు చేయాలని తాను అనుకుంటే ముఖ్యమంత్రి ఇష్టపడలేదన్నారు. డబ్బులు వసూలు చేసే మిత్రులు తప్పితే సొంత కుటుంబంలోను ఆయనకు మిత్రులు ఉండరని ఎద్దేవా చేశారు. తుఫాను బాధితులను పరామర్శించేందుకు కనీసం పది నిమిషాలు కేటాయించని కిరణ్.. నష్టపోయిన వారికి పరిహారం కూడా ఇవ్వలేకపోయారన్నారు.












Click it and Unblock the Notifications