అసెంబ్లీ 10న బడ్జెట్: 13వ తేదీన కిరణ్ రెడ్డి రాజీనామా?

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభా సమావేశాలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. 13వ తేదీన సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పదవ తేదీన శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. ఈ సమావేశాలు 13వ తేదీ వరకు జరుగుతాయి.

శాసనసభా సమావేశాలకు ముందు పదవ తేదీన ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడి, పలువురు నేతలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పదవి తేదీన హైదరాబాదులో అందుబాటులో ఉండాలని ఆయన శాసనసభ్యులకు సూచిస్తున్నట్లు చెబుతున్నారు.

Kiran Reddy busy in consulting MLAs

శనివారం ఉదయం నుంచి ఆయన ఫోన్ ద్వారా శాసనసభ్యులను, మంత్రులను, నాయకులను తన రాజీనామా విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది మంత్రులు ఆయనను శనివారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇప్పటికే రాజీనామా చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, అయితే 21వ తేదీవరకు ఆగాలని తాము అడుగుతున్నామని పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజయవాడలో శనివారం చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నెల 21వ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. ఈలోగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు విషయాన్ని తేల్చుకోవచ్చుననేది లగడపాటి రాజగోపాల్ ఆంతర్యంగా తెలుస్తోంది. బిల్లు భవిష్యత్తు తేలిన తర్వాత రాజీనామా చేయడం మంచిదనే ఉద్దేశంతో కొంత మంది నాయకులకు ముఖ్యమంత్రికి నచ్చజెప్పుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు అధిష్టానం వేటు వేస్తుందనే ఉద్దేశంతో ఆయన వేచి చూస్తున్నట్లు కనిపించింది. అయితే, ఆయనపై వేటు వేసే ఉద్దేశం లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ శనివారం స్పష్టంగానే చెప్పారు. దాంతో రాజీనామా చేయడమే ఉత్తమంగా కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అనుకున్నారని, అయితే ఆలా చేస్తే హీరో అవుతారని వెనక్కి తగ్గారని లగడపాటి రాజగోపాల్ అన్న విషయం గమనార్హం. అయితే, ఈ నెల 12వ తేదీన రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే, అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆయన తన రాజీనామా వ్యవహారాన్ని ఒక్క రోజుకు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+