కిరణ్ రెడ్డి ఎందుకు పార్టీ పెడ్తారు, పెట్టరు: ఆజాద్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పార్టీ ఎందుకు పెడుతారని, పెట్టబోరని కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఫ్యాఫ్సీలో జరిగిన పివి నరసింహారావు స్మారకోపన్యాసం ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చించి గడువులోగా తిరిగి పంపుతారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
శాసనసభలో, శాసనమండలిలో చర్చించి రాష్ట్ర విభజనకు వ్యతిరేకమో, అనుకూలమో సభ్యులు చెప్పాలని ఆయన అన్నారు. మంత్రి వర్గం ఆమోదించిన తర్వాత రాష్ట్రాన్ని ముసాయిదా బిల్లును పంపించామని, రాష్ట్రపతి 42 రోజులు గడువు ఇచ్చారని, దాన్ని పంపి నెల రోజులు అవుతున్నా చర్చ జరగడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో వెనకడుగు లేదని ఆయన అన్నారు.

శానససభలో చర్చించుకున్నా రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు విభజన ప్రక్రియను పూర్తి చేస్తుందని ఆయన చెప్పారు. జనవరి 23వ తేదీలోగా చర్చించి పార్లమెంటుకు పంపిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత మూడేళ్లుగా ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, మరో ఆరు రోజులు నమోదు కాకపోతే పోలిరహిత దేశంగా భారత్‌ను ప్రకటిస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా అయిన ఆజాద్ చెప్పారు.
హైదరాబాదులోని ఫ్యాప్సీ భవన్ వద్ద గులాం నబీ ఆజాద్‌ను ఘెరావ్ చేయడానికి సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి హైదరాబాదులోని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications