చిన్నారుల మృతదేహాలపై కత్తిగాట్లు, భార్యనూ పిలిచాడు
హైదరాబాద్: ఇక్‌ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ ఇద్దరు కుమారుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తయింది. ఇద్దరు పిల్లలకు మెడల పైన కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పెద్దబ్బాయి మెడ పైన 2 కత్తిగాట్లు, చిన్నబ్బాయి మెడ పైన మూడు కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
బన్సీలాల్ పేట శ్మశానవాటికలో పిల్లల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. చిన్నారులు విఠల్ విరించి, నందవిహారి మూడు రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. వారిని చంపిన తండ్రి గురుప్రసాద్ తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ రోజు సుహాసినినీ రమ్మన్నాడు

కాగా, గురు ప్రసాద్ తన పిల్లలను చంపిన రోజు తన భార్యను కూడా రమ్మన్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య సుహాసిని తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. గురుప్రసాద్ తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని తెలిపారు. అనుమానం రాకుండా పిల్లలను హతమార్చాడని, ఆ రోజు తనను కూడా రమ్మంటే తాను వెళ్లలేదని పేర్కొన్నారు.
కడప ఫ్యామిలీ మృతి కేసు.. తల్లి ఆరోపణ
కడపలో ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన కృపాకర్, ఆయన భార్య మౌనిక, వారి ముగ్గురు పిల్లలు యేడాది క్రితం అదృశ్యం కాగా.. వారు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఐదు అస్థిపంజరాలను పోలీసులు వెలుపలకు తీశారు. వీరిని రాజారత్నమే హత్య చేయించారని మౌనిక తల్లి ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే తన కూతురును చంపుతానని బెదిరించారని, పెళ్లైన నాటి నుండే తన కూతురిని హింసించారన్నారు.












Click it and Unblock the Notifications