వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు జూనియర్ ను తొక్కేస్తారు : పవన్ తో అలా- తారక్ తో ఇలా : నెక్స్ట్ ఇదే- కొడాలి..!!

|
Google Oneindia TeluguNews

జూనియర్ ఎన్టీఆర్ లక్షణాలు..శక్తి సామర్ధ్యాల గురించి మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీావ్యవస్థాపక అధ్యక్షుడి మనవడిగా జూనియర్ కు పూర్తిగా సీనియర్ ఎన్టీఆర్ హాహభావాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. జూనియర్ ప్రజాకర్షణలో టీడీపీలో ఎవరికి లేని శక్తి ఉందన్నారు. ప్రజల మధ్యన ప్రసంగాల్లో ధీటుగా.. ఎక్కడా పొరపాటు లేకుండా చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పగల నైపుణ్యం ఉందని కొడాలి నాని వివరించారు.

జూ ఎన్టీఆర్ కు 9 బాషల్లో పట్టు

జూ ఎన్టీఆర్ కు 9 బాషల్లో పట్టు

తనకు జూనియర్ తో ఉన్న పరిచయం..సంబంధాలతో ఆయన్ను దగ్గరగా చూసానని.. తాతకు తగ్గ మనవడని ప్రశంసించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తొమ్మది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని వెల్లడించారు. తెలుగు..తమిళం..కన్నడ..మళయాళం..ఉర్దూ.. ఇంగ్లీషు.. స్పాన్..హిందీ భాషల్లో ఎక్కడా ఎటువంటి రిఫరెన్స్ లేకుండా మాట్లాడుతారని చెప్పుకొచ్చారు. పెన్ లేకుండా.. పుస్తకం చూడకుండా మాట్లాడుతారని వివరించారు. ఆరు నెలల సమయం ఇస్తే మరో ఆరు నెలల్లో మరో ఆరు బాషలు నేర్చురోగల సమర్ధత జూనియర్ కు ఉందని చెప్పారు.

బీజేపీ వినియోగించుకుంటుంది

బీజేపీ వినియోగించుకుంటుంది

ముఖ్యమంత్రి జగన్ కు ప్రధానితో పాటుగా ఎవరి అప్పాయింట్ మెంట్ అయినా 72 గంటల్లో దొరుకుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు మూడేళ్లుగా ప్రధాని మోదీ - అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని, అయినా సాధ్య పడలేదన్నారు. ప్రధాని మోదీ - షా రాజకీయంగానే ఆలోచనలు చేస్తారని.. నిఘా వర్గాల సమాచారం మేరకే జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారని వ్యాఖ్యానించారు.

పాన్ ఇండియా హీరోగా ప్రసంగాలు దంచి కొడతారని చెప్పారు. లోకేష్ ప్రచారం చేస్తే పార్టీకి నష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ను ఉపయోగించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అన్ని భాషల మీద అంత పట్టు ఉన్న వ్యక్తి మరెవరూ లేరని వివరించారు.

చంద్రబాబు తొక్కేస్తారంటూ

చంద్రబాబు తొక్కేస్తారంటూ

బీజేపీకి ఎన్టీఆర్ ను దగ్గర తీసుకుంటే పార్టీకి మంచిదన్నారు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయనే కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రోత్సహించరని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రమాణ స్వీకారం వేదిక పైన పవన్ ను పక్కన కూర్చొబెట్టుకొని.. జూనియర్ ను గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారని కొడాలి నాని పేర్కొన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తెలుసన్నారు. దీంతో..అమిత్ షా అన్నీ తెలుసుకొనే జూనియర్ తో భేటీ అయ్యారని చెప్పారు. దక్షిణాదిలో బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ సేవలు వినియోగించుకుంటుందని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

English summary
Ex minister Kodali Nani sensational comments on Jr NTR future in Politics, says BJ utilise the Junior serivces in the southern states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X