ముఖ్యమంత్రిగా పోటీ వస్తాడనే చంద్రబాబు లోకేష్ ను ఓడించాడు; ఆయనో 420: కొడాలి నాని సంచలనం

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి విపక్షనేత చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయిన కొడాలి నాని నా గురించి, వంశీ గురించి, జగన్ కుటుంబ సభ్యులపై టిడిపి ఆఫీస్ నుండి లోకేష్ చేయించిన పోస్టింగ్ లపై వాళ్ళను ఏం చెయ్యాలో చెప్పాలని ప్రశ్నించారు. మీరు ఎవరినైనా ఏమైనా అనొచ్చా అంటూ నిలదీశారు. వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతంగా చేసిన వ్యాఖ్యలు కావని సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలని కొడాలి నాని పేర్కొన్నారు.

 చంద్రబాబు మహా నటుడు .. మండిపడిన కొడాలి నాని

చంద్రబాబు మహా నటుడు .. మండిపడిన కొడాలి నాని

రాజకీయాల కోసం పెళ్ళాన్ని కూడా వాడుకుంటారా అంటూ కొడాలి నాని మరోమారు చంద్రబాబు పై ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడితేనే అర్థం అవుతుందని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు మహానటుడు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వయసు పెరిగింది గానీ బుద్ధి పెరగలేదు అన్న కొడాలి నాని, తాడిచెట్టుకు కూడా వయసు వస్తుందని, అయితే ఏం లాభం అంటూ వ్యాఖ్యానించారు. విలువ ఇస్తామా అంటూ ప్రశ్నించారు. 74 ఏళ్ల వయసు వస్తే సరిపోతుందా అంటూ కొడాలి నాని చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారు .

జగన్ పోరాట యోధుడు .. చంద్రబాబు బిచ్చగాడు

జగన్ పోరాట యోధుడు .. చంద్రబాబు బిచ్చగాడు

చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఎన్టీ రామారావు అని పేర్కొన్న కొడాలి నాని చంద్రబాబు వారిద్దరికీ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. లోకేష్ ను మంగళగిరిలో ఓడించింది చంద్రబాబేనని, ముఖ్యమంత్రి పదవికి పోటీ వస్తాడనే చంద్రబాబు లోకేష్ ను ఓడించాడు అంటూ కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులో ఉన్న జగన్ ను గాల్లో వస్తాడు గాల్లో పోతాడు అని వస్తా అంటూ ప్రశ్నించిన కొడాలి నాని జగన్ ఒక పోరాట యోధుడు అంటూ కితాబిచ్చారు. ఇక చంద్రబాబును ఓ బిచ్చగాడు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు 420 అంటూ మండిపడ్డారు.

వంశీ వ్యాఖ్యలు చేసిన 28 రోజుల తర్వాత చంద్రబాబు ఏడవటానికి కారణం ఏంటి?

వంశీ వ్యాఖ్యలు చేసిన 28 రోజుల తర్వాత చంద్రబాబు ఏడవటానికి కారణం ఏంటి?

తనకు, వల్లభనేని వంశీ కి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టడం ఏమిటీ అంటూ నిప్పులు చెరిగారు కొడాలి నాని. గుడివాడ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారని కొడాలి నాని పేర్కొన్నారు. అక్టోబర్ 22వ తేదీన వల్లభనేని వంశీ ఆన్ రికార్డు వ్యాఖ్యలు చేస్తే, వ్యాఖ్యలు చేసిన 28 రోజుల తర్వాత చంద్రబాబు ఏడవడానికి గల కారణం ఏమిటో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. తన ప్రణాళికను అమలు చేయడానికి చంద్రబాబు అసెంబ్లీని వేదికగా చేసుకున్నాడని కొడాలి నాని విమర్శించారు.

Recommended Video

    Lakshya Trailer Review | Akhanda Movie Is The Deciding Factor || Oneindia Telugu
    గుడివాడలో కమ్మ మీటింగ్ పెడతా వస్తారా ... ప్రశ్నించిన కొడాలి నాని

    గుడివాడలో కమ్మ మీటింగ్ పెడతా వస్తారా ... ప్రశ్నించిన కొడాలి నాని

    లక్ష్మీపార్వతిని బూతుగా చూపించి వెళ్ళగొట్టే కుట్ర చేసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు కొడాలి నాని. ఆ రోజు లక్ష్మీ పార్వతి తీవ్ర మనోవేదనకు గురి కాలేదా అని ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అని పేర్కొన్న కొడాలి నాని టిడిపి నేతలకు సవాల్ విసిరారు. గుడివాడలో కమ్మ మీటింగ్ పెడతానని దమ్ముంటే అరికెపూడి గాంధీ మల్లాది వాసు రావాలని చాలెంజ్ చేశారు. ఎవరి గుడ్డలూడదీసి కొడతారో చూద్దాం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కొడాలి నాని .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+