ఎన్టీఆర్ శాపం వల్లే టీడీపీకి ఈ దుస్థితి; వెన్నుపోటు పొడిచి దండలేస్తారా? విరుచుకుపడిన కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు సొంతంగా ప్రజల ముందుకు వెళ్ళే ధైర్యం లేక ఎన్టీఆర్ పేరును జపిస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసే మళ్లీ ఎన్టీఆర్ నామ జపం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ ను పార్టీ నుండి ఎందుకు బయటకు పంపారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించిన కొడాలి నాని ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.

ఎన్టీఆర్ పెరెత్తే అర్హత కూడా లేదని మండిపడిన కొడాలి నాని
చంద్రబాబుకు ఎన్టీఆర్ పై ఎటువంటి ప్రేమ లేదని పేర్కొన్న కొడాలి నాని ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత కూడా వాళ్లకు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీ లాక్కుని, మళ్లీ ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తారా అంటూ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ శాపం వల్లే టీడీపీ దిగజారిపోయిందని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

కూర్చుని లేవలేని స్థితిలో ఉన్న చంద్రబాబు పార్టీని పరుగులు పెట్టిస్తాడా?
73 ఏళ్ల వయసులో రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్న కొడాలి నాని, కూర్చుని లేవలేని స్థితిలో ఉన్న చంద్రబాబు పార్టీని పరుగులు పెట్టిస్తాడా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఇంతకాలం పని చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఏ ఒక్క పథకం అయినా ప్రారంభించారా అని కొడాలి నాని ప్రశ్నించారు.

చంద్రబాబును, లోకేష్ ను ఎన్టీఆర్ అభిమానులు రాజకీయంగా సమాధి చేస్తారు
ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు ఏపీకి పారిపోయి వచ్చాడు అంటూ ఎద్దేవా చేసిన కొడాలి నాని, చంద్రబాబు కారణంగానే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని వెల్లడించారు. చంద్రబాబును, లోకేష్ ను ఎన్టీఆర్ అభిమానులు రాజకీయంగా సమాధి చేస్తారని మంత్రి కొడాలి నాని తిట్టిపోశారు. ఎన్టీఆర్ ను మోసం చేసిన వాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారని కొడాలి నాని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యిందని కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ శాపం వల్లే చంద్రబాబు కొడుకు పప్పు మంగళగిరిలో ఓటమి పాలయ్యాడని కొడాలి నాని పేర్కొన్నారు.

ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి?
ఎన్టీఆర్ నుండి పార్టీ లాక్కున్న సమయంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని పేర్కొన్న కొడాలి నాని, ఇప్పుడు టిడిపి పరిస్థితి ఏంటో చెప్పాలంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఇక ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపి పోటీ చేయలేని స్థితికి చేరుకుందని కొడాలి నాని పేర్కొన్నారు. ఏపీ లోనూ టిడిపిని ప్రజలు భూస్థాపితం చేస్తారని కొడాలి నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అభిమానులు వచ్చే ఎన్నికల్లో పగ, ప్రతీకారం తీర్చుకుంటారని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు వల్ల ఏపీ సర్వనాశనం అయ్యిందని కొడాలి నాని మండిపడ్డారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications