వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ వేడుకల్లో కోదండరామ్, గౌడ్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా మారింది. తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన ఈ బతుకమ్మ వేడుకలు శనివారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ యావత్తూ సమాయత్తమైంది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న క్రమంలో ప్రభుత్వ పండుగగా దీన్ని గుర్తించారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ వేడుకలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో ట్యాంక్‌బండ్ వద్ద ఘనంగా జరగనున్నాయి. ఎంగిల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి.

రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి కూడలిలో పెట్టి మహిళలు చుట్టూ తిరుగుతూ చేతులు కలిపి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ బతుకమ్మలు ఆడుతారు. మహిళలు రంగుల రంగుల దుస్తుల్లో కనువిందు చేస్తారు. హైదరాబాదులో బతుకమ్మ పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్, కరీంనగర్ నగరాల్లో కూడా ఈ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.

1. జై తెలంగాణ నినాదాలు..

1. జై తెలంగాణ నినాదాలు..

శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ న్యాయవాదుల జెఎసి నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తెంలగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పాల్గొన్నారు.

జై తెలంగాణ బతుకమ్మ..

జై తెలంగాణ బతుకమ్మ..

బతుకమ్మ వేడుకలకు, తెలంగాణ ఉద్యమానికి అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇలా జై తెలంగాణ నినాదాలతో బతుకమ్మను ఎత్తుకుంది ఓ మహిళ

బతుకమ్మ వేడుకల్లో కోదండరామ్..

బతుకమ్మ వేడుకల్లో కోదండరామ్..

సిటీ సివిల్ కోర్టు ఆవరణలో తెలంగాణ న్యాయవాదులు ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ హాజరయ్యారు.

బతుకమ్మ వేడుకల్లో శ్రీనివాస గౌడ్..

బతుకమ్మ వేడుకల్లో శ్రీనివాస గౌడ్..

గృహకల్ప వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు శ్రీనివాస గౌడ్ ఇలా..

బతుకమ్మలతో మహిళలు..

బతుకమ్మలతో మహిళలు..

రంగు రంగు పూలతో పేర్చిన బతుకమ్మలను నెత్తిన ఎత్తుకుని గృహకల్ప వద్ద మహిళలు ఇలా కనిపించారు..

జై తెలంగాణ బతుకమ్మ

జై తెలంగాణ బతుకమ్మ

హైదరాబాదులోని గృహకల్ప వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన బతుకమ్మ వేడుకల్లో జై తెలంగాణ నినాదమే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

మహిళల కోలాటం..

మహిళల కోలాటం..

హైదరాబాదులోని బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు గృహకల్ప వద్ద కోలాటం కూడా ఆడారు. ఈ కోలాటం ఆటకు ప్రత్యేక శిక్షణ అవసరం.

కోలాటం ఆటలో శ్రీనివాస గౌడ్...

కోలాటం ఆటలో శ్రీనివాస గౌడ్...

తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు శ్రీనివాస గౌడ్ కోలాటం ఆటలో ఉల్లాసంగా ఇలా పాలు పంచుకున్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కొనసాగిస్తుండడంతో ఆ సంతోషం బతుకమ్మ వేడుకల్లో కనిపిస్తోంది.

English summary
In connection with the Saddula Batukamma festival on Saturday, traffic restrictions will be imposed in some parts of the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X