వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని అమరావతి రైతులకు కోదండరాం మద్దతు; జగన్ సర్కార్ కు సూచన !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతి కోసం నవంబర్ 1 నుండి న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి మహా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తన మద్దతును ప్రకటించారు.

విజయవాడలో కోదండరాం ను కలిసిన అమరావతి రైతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో జగన్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. అమరావతి నుంచి పాలన సాగాలని అమరావతి ప్రాంత రైతులు కోరుతున్నారు. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు.ఈ క్రమంలో విజయవాడకు వచ్చిన కోదండరామ్ ను కలిసిన అమరావతి రైతులు, రాజధాని రైతులకు మద్దతుగా తమ పాదయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Kodandaram support for farmers in the capital Amaravati; suggests Jagan govt !!

రైతుల ప్రమేయం లేకుండా రాజధాని అమరావతిపై నిర్ణయం తీసుకోవడం సరికాదన్న కోదండరాం
దీంతో తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం రైతుల ప్రమేయం లేకుండా రాజధాని అమరావతిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జగన్ సర్కార్ ను ఆయన విజ్ఞప్తి చేశారు. మహా పాదయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కి అందించి తమ పాదయాత్రకు మద్దతు తెలపాలని ప్రకటించిన అమరావతి రైతులకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు కోదండరాం.

రైతులతో చర్చించి వారి సమస్యలు తీర్చే విధంగా నిర్ణయం తీసుకోవాలన్న కోదండరాం
రాజధాని అమరావతి పై గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారని దాని ప్రకారం రైతుల భూములు ఇచ్చారని పేర్కొన్న కోదండరాం, ఇప్పుడు రైతుల ప్రమేయం లేకుండానే అమరావతి తరలింపు పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని వెల్లడించారు. రైతులతో చర్చించి వారి సమస్యలు తీర్చే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న కోదండరాం రైతుల కష్టాలను ప్రభుత్వం తీర్చాలంటూ పేర్కొన్నారు. తనకు వీలున్నప్పుడు కచ్చితంగా పాదయాత్రలో పాల్గొంటానని చెప్పిన కోదండరాం, రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జగన్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. రైతులకు తన మద్దతు ప్రకటించారు.

నవంబర్ 1 నుండి న్యాయస్థానం టూ దేవస్థానం .. రైతుల మహా పాదయాత్ర
ఇదిలా ఉంటే నవంబరు ఒకటవ తేదీ నుండి న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతు మహా పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల 5 నిమిషాలకు అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. మహా పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తుళ్లూరు రైతు దీక్ష శిబిరంలో కాలభైరవ, లక్ష్మీ గణపతి, నవగ్రహ హోమాలు చేయనున్నారు. హోమానికి ముందు మహిళా రైతులు సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా రైతులు ఏడు కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకొని అక్కడ భోజనం చేయనున్నారు. ఇక అక్కడ నుండి మరో ఏడు కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు. ఈ మహా పాదయాత్ర నవంబర్ 1 నుండి నవంబర్ 17 వరకు జరగనుంది.

English summary
Kodandaram, chief of the Telangana Jana Samithi, announced his support for the Amaravati farmers who are conducting maha padayatra in AP for capital amaravati .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X