ప్రపంచంలోనే విశిష్టమైన రాజధాని: కోడెల, డిసెంబర్‌లోపు తాత్కాలిక అసెంబ్లీ
హైదరాబాద్/విజయవాడ: ప్రపంచంలోనే విశిష్టమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.
డిసెంబర్ లోపు తుళ్లూరు ప్రాంతంలో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందని కోడెల శివప్రసాదరావు చెప్పారు. అసెంబ్లీ శీతకాల సమావేశాలు తుళ్లూరులోనే జరుగుతాయని ఆయన తెలిపారు.
‘శంకుస్థాపన' యంత్రాలకు దుర్గగుడిలో పూజలు

అమరావతి నగర శంకుస్థాపన సమయంలో ప్రతిష్ఠించనున్న 21 విశిష్ట యంత్రాలకు బుధవారం నుంచి దుర్గ గుడిలో పూజలు నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ఈ యంత్రాలను ప్రతిష్ఠించనున్నారు.
వీటిని రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తయారు చేయించారు. రాగి లోహంతో చేసిన ఈ యంత్రాలను అక్టోబర్ 19వ తేదీ వరకు ఆలయంలోనే ఉంచి పూజలు చేయనున్నారు. అనంతరం వీటిని శంకుస్థాపన జరిగే ప్రదేశానికి తరలిస్తారు.












Click it and Unblock the Notifications