24న టీడీపీలోకి కోటంరెడ్డి - సోదరుడికి రూట్ క్లియర్..!?
కోటంరెడ్డి టీడీపీలో చేరేందుకు రూట్ క్లియర్ అవుతోంది. టీడీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కోటంరెడ్డి టీడీపీలో చేరేందుకు రూట్ క్లియర్ అవుతోంది. టీడీపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నెల్లూరు లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీని వీడటం ఖాయమని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆనం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా..కోటంరెడ్డి పార్టీలో చేరిక పైన సానుకూలత వ్యక్తం చేయటం లేదు. ఇదే సమయంలో కోటంరెడ్డి అసెంబ్లీలోనూ ప్రభుత్వం పైన పోరాటం ప్రారంభించారు. ఇక.. ఇప్పుడు టీడీపీలో ఎంట్రీ దిశగా తొలి అడుగు పడుతోంది.

టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుడు
ఈ నెల 24న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు saiటీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కోటంరెడ్డి గిరధర్ రెడ్డిని తాజాగా వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రావడంతో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. అన్న శ్రీధర్ రెడ్డికి మద్దతుగా సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒక సమయంలో గిరిధర్ రెడ్డికి రూరల్ బాధ్యతలు వైసీపీలో అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ, గిరిధర్ అన్నతోనే కొనసాగాలని నిర్ణయించటంతో ఆయన పైన వేటు వేసింది. ఇప్పుడు అన్నకు టీడీపీలో రూట్ క్లియర్ చేస్తూ తొలుత తాను ఎంట్రీ ఇస్తున్నారు.

టీడీపీలోకి ఎంట్రీ..నియోజకవర్గంలో పట్టు
వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలకు ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించారు. అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు వైసీపీ నేతలు అప్పట్లోనే ఆరోపించారు. జిల్లా టీడీపీ నేతల నుంచి కోటంరెడ్డి పార్టీలో చేరిక పైన వ్యతిరేకత కనపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా స్వయంగా కోటంరెడ్డి వెల్లడించారు. దీని పైన చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతూ ధిక్కార స్వరం వినిపించేలా చూడాలనేది టీడీపీ వ్యూహం. ఇదే సమయంలో ఇప్పుడు రూరల్ లో పట్టు సాధించే క్రమంలో భాగంగా ముందుగా సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు..పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఈ చేరిక ద్వారా అధికారికంగా అవకాశం దక్కుతుంది. శ్రీధర్ రెడ్డి మాత్రం మరి కొంత కాలం రెబల్ ఎమ్మెల్యేగానే కొనసాగనున్నట్లు కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications