జగన్ పార్టీపై ఫిర్యాదు చేశా: గీత, ఆస్తులు కాజేయలేదని

తనపై చేసిన ఆరోపణలు ఎమ్మెల్యేవా, పార్టీ అభిప్రాయమా అనేది స్పష్టం చేయాలని గీత ప్రశ్నించారు. ఎస్టీ కాకుండానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు బీఫారం ఇచ్చిందా అని ఆమె అన్నారు. మహిళా ఎంపి అనే చులకన భావంతో చూస్తున్నారని అన్నారు.
తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎవరి ఆస్తులు తాను కాజేయలేదని గీత పేర్కొన్నారు. తాను ఇంతవరకూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం లేక చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంపి అయిన తనపై సామాజిక వెబ్‌సైట్లలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళల పట్ల తీవ్ర వివక్ష ఉందని ఆమె ఆరోపించారు. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలంతా బయటకు వస్తారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications