వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారం రోజుల్లో 100 పేకాట శిబిరాలపై దాడులు .. గుడివాడ పేకాట దాడులపై కృష్ణా జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

గుడివాడలో పేకాట శిబిరాలపై జరిగిన దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపగా , తాజాగా పేకాట వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో వంద పేకాట శిబిరాలపై దాడులు జరిపామని చెప్పిన ఎస్ పి రవీంద్ర బాబు, గుడివాడలో జరిగిన దాడే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పేకాట శిబిరాలు, కోడి పందాల శిబిరాలపై దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఎవరైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .

గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం తిమ్మిరిశ గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందని, ఎస్ ఈ బీ టీం , స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. గుడివాడలో జరిగిన దాడులలో 33 మందిని అరెస్ట్ చేశామన్నారు. 28 కార్లు, 13 బైకులు, 55, 39,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పొట్లూరి మురళి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని పేర్కొన్న ఎస్పి ప్రస్తుతం విచారణ జరుగుతుందని పేర్కొన్నారు .

కొడాలి నానీని పేకాడేస్తున్న ప్రతిపక్షాలు .. ఉన్నపళంగా సీఎం జగన్ దగ్గరకు మంత్రి కొడాలి నాని..ఏపీలో హాట్ టాపిక్కొడాలి నానీని పేకాడేస్తున్న ప్రతిపక్షాలు .. ఉన్నపళంగా సీఎం జగన్ దగ్గరకు మంత్రి కొడాలి నాని..ఏపీలో హాట్ టాపిక్

Krishna District SP Key remarks over SEB Raids on Gudivada poker dens

ఇక ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అన్నది విచారణ తర్వాత వెలుగులోకి వస్తుందంటూ పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలపై తాము స్పందించమని ఎస్పీ తెలిపారు. మూడు గంటల పాటు జరిగిన ఈ దాడులను వీడియో కూడా తీశామని ఎస్పీ పేర్కొన్నారు. వారం రోజుల్లో 100 పేకాట శిబిరాలు పై దాడులు చేశామని పేర్కొన్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు , ఒక్క గుడివాడలో జరిగిన పేకాట శిబిరాలపై దాడులు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని అన్నారు.

English summary
SP Rabindranath Babu said 33 poker players were arrested in Timirisha. He said Rs 55.39 lakh cash, 28 cars and 13 bikes were seized from them. The poker camp is being run under the auspices of a man named Potluri Murali. The SP said the investigation into the poker camps would continue. Gudivada was the only one highlighted that 100 camps were attacked during the week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X