కృష్ణాజిల్లాలో ఇప్పుడు హాట్ సీటు అదే ? విజయవాడను మించిన పోటీ !
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుతో అభ్యర్ధుల తలరాతలు మారిపోతున్నాయి. అదే సమయంలో ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా లెక్కలు మారతాయని ఆశలు పెట్టుకుంటున్న వైసీపీకి సొంత పార్టీలో అంతర్గత పోరు పట్టి పీడిస్తోంది. అలాగే విపక్ష టీడీపీకి అభ్యర్ధిని ఖరారు చేయకముందే తలనొప్పులు తప్పని పరిస్దితి. ఈ రెండు ఈక్వేషన్స్ ఒకే నియోజకవర్గంలోనే కనిపిస్తుంటే దానిపేరే పెనమలూరు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో భాగమైన విజయవాడ నగరంలోని మూడు సీట్లతో పోలిస్తే రూరల్ నియోజకవర్గమైన పెనమలూరు సీటులో ఇప్పుడు రాజకీయం వాడీవేడిగా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్దసారధి తన సీటు కోల్పోయారు. విపక్ష టీడీపీని టార్గెట్ చేయడంలో ఆయన వైఫల్యం సీటుకే ఎసరుపెట్టింది. అప్పటికే మంత్రి పదవి రాలేదనే ఆవేదనతో ఉన్న సారధి.. టీడీపీతో టచ్ లోకి వెళ్లిపోయారు. ఇక్కడే రాజకీయం మారింది.

పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్ధసారధి స్ధానంలో ఇదే జిల్లాలో పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ కు వైసీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చేసింది. ఇక్కడితో వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఇటు వైసీపీకి కానీ, అటు విపక్ష టీడీపీకి కానీ తాజా పరిణామాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే సారధి స్ధానంలో జోగి రమేష్ రావడంతో ఆయన టీడీపీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుంటారని, అప్పుడు జోగి వర్సెస్ సారధి పోరు ఉంటుందని అంతా భావించగా అలా జరగట్లేదు.
అప్పటికే వైసీపీలో సారధి స్ధానంలో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. జోగి రమేష్ స్ధానికేతరుడని, పట్టు మని పదిమంది కూడా తెలియని ఆయనకు పెనమలూరులో టికెట్ ఇస్తే ఓడిపోతారనే ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఇవాళ జోగి రమేష్ స్వయంగా రంగంలోకి దిగి తాను బాల్యంలో పెనమలూరునే పెరిగిగానంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అలాగే టీడీపీలో ఏమైనా పరిస్దితి మెరుగ్గా ఉందా అంటే అదీ లేదు. వైసీపీలో టికెట్ దక్కని పార్ధసారధి టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి ఈ నెల 18న గుడివాడలో జరిగే రా కదలిరా సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తనకు సిట్టింగ్ సీటు పెనమలూరే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ఇక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న బోడె ప్రసాద్ ను బుజ్జగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. కానీ ఆయన మాత్రం సీటూ నాదే గెలుపూ నాదే అంటూ తేల్చిచెప్పేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications