తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?: ప్రభాస్‌కు గాలమా? తేల్చి చెప్పిన బీజేపీ!
ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజును తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
విజయవాడ/చెన్నై: ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజును తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన పేరును కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కృష్ణం రాజు పేరు దాదాపు ఖరారయిందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడు ఇంచార్జి గవర్నర్‌గా సిహెచ్ విద్యాసాగర రావు ఉన్నారు. విద్యాసాగర రావు మహారాష్ట్ర గవర్నర్. గత ఏడాదిలో తమిళనాడు గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసిన అనంతరం విద్యాసాగర రావు ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.
{photo-feature}
ఇదిలా ఉండగా, తమిళనాడు గవర్నర్‌గా కృష్ణం రాజు అనే పుకార్ల పైన బీజేపీ ఓ పత్రికతో స్పందించిందని తెలుస్తోంది. అయితే, ఇదంతా అబద్దమని, కేవలం పుకార్లేనని బీజేపీ తేల్చి చెప్పిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications