'నగ్నంగా వీడియో తీసి సాయి శ్రీనివాస్ కృపామణిని బెదిరించాడు'
ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన వివాహిత కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ తాను చేసిన పనిని అంగీకరించాడని పోలీసులు చెప్పారు. కృపామణిని నగ్నంగా వీడియో తీసి బెదిరించినట్లు సాయి శ్రీనివాస్ అంగీకరించినట్లు తెలిపారు.
వీడియోలు నెట్‌లో పెడతానని గుడాల సాయి శ్రీనివాస్ బెదిరించడం వల్లనే కృపామణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. గుడాల సాయి శ్రీనివాస్‌ను పోలీసులు శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

కృపామణి భర్తపై పెట్టిన కేసు పరిష్కారం కోసం సాయి శ్రీనివాస్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడని ఎస్పీ భాస్కర్ భూషణ్ చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లతో డబ్బులు గుంజడం శ్రీనివాస్‌కు అలవాటు అని కూడా చెప్పారు. నిందితుడి నుంచి రెండు కార్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తణుకు అస్పత్రిలో నిందితుడు గుడాల శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తణుకుకు చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌తో పాటు తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రం వేధించడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణిలో సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి కాలువల పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications