రెండు చిప్పలే, ఇప్పుడిలా తిడ్తున్నారు: బాబుపై కెటిఆర్

బాబుకు రాజకీయంగా మిగిలేది రెండు కొబ్బరి చిప్పలే అన్నారు. టిడిపి దళారుల పార్టీగా మిగిలిందన్నారు. కాంగ్రెసు, తెరాసల మధ్య పొత్తు కుదిర్చేందుకు టిటిడిపి నేతలు దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శఇంచారు. తమ పార్టీ వ్యవహారాలపై సలహాలు, సూచనలు తమకు అవసరం లేదన్నారు. టిడిపి తెలంగాణ నేతల తీరు ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉందన్నారు. అఖిల పక్షం కోసం డిమాండ్ చేసిన చంద్రబాబే దూరంగా ఉండటం విడ్డూరమన్నారు.
చంద్రబాబు నటనలో స్వర్గీయ నందమూరి తారక రామారావును మించిపోయారన్నారు. చంద్రబాబుతో చర్చించేందుకు వరంగల్ జిల్లాకు చెందిన ఫణికర్ మల్లయ్య చాలన్నారు. తెలంగాణ వద్దని చెబుతున్నా టిటిడిపి నేతలకు ఆ పార్టీలో ఉండేందుకు సిగ్గుందా అన్నారు. సీమాంధ్ర పత్రికలు తమ ఉన్నాదాన్ని రాష్ట్రపతిపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రపతినే తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు వ్యవహరించారన్నారు.
పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలను బాబు ఒకే వేదికపై ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు. తెలంగాణపై ఇప్పటికి పలు కమిటీలు వేశారని, ఇంకా ఎన్ని కమిటీలు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు చెప్పి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారన్నారు. బాబు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఆయన మాటలకు దయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు.
విభజనపై తీర్మానం అంటూ చంద్రబాబు తలా తోకా లేని ప్రతిపాదన తెస్తున్నారని మండిపడ్డారు. ఏం కావాలో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. సమన్యాయం అంటూ మోసం చేసే చంద్రబాబుకు మిగిలేది రెండు చిప్పలే అన్నారు. పదవి కోసం సొంత మామనే చంపిన దుర్మార్గుడన్నారు. విలీనం గురించి మాట్లాడే టిటిడిపి నేతలు మొదట తెలంగాణ కోసం చంద్రబాబును నిలదీయాలను సూచించారు. బాబులాంటి పరాన్నజీవుల నుండి ఈ రోజు తెలంగాణ విముక్తి కోరుకుంటోందన్నారు. ఢిల్లీలో బాబు ఎందుకు దీక్ష చేశాడో ఆయనకే తెలియదన్నారు.












Click it and Unblock the Notifications