ఎందుకు రారు: బాబు, జగన్‌లను ఏకిపారేసిన కెటిఆర్

రాష్ట్ర విభజన ఆపితే వచ్చే ఎన్నికలలో తమ పార్టీ తరఫున గెలిచే ఎంపీలతో కేంద్రానికి మద్దతిస్తానని చంద్రబాబు ఫోన్ చేసి చెప్పినట్లుగా ఓ పార్టీ అధ్యక్షుడు చెప్పారని ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేందుకు బాబు చేయని ప్రయత్నాలు లేవన్నారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టవద్దన్నారు. రాష్ట్రపతి గురించి దురభిప్రాయం కలిగేలా కొందరు సీమాంధ్ర నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
2004లో తెరాస, కాంగ్రెసుల మధ్య పొత్తు కుదర్చడంలో ప్రణబ్‌దే కీలక పాత్ర అన్నారు. జగన్, చంద్రబాబులు సమన్యాయం అని అంటున్నారని, అంటే ఏమిటో చెప్పాలన్నారు. ఆ సమన్యాయం కోసమైనా వారు అఖిల పక్ష సమావేశానికి రావాలన్నారు. సమన్యాయం అంటే తెలియక పోవడానికి ఏమైనా బ్రహ్మపదార్థమా అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షులుగా బాబు, జగన్‌లు అఖిల పక్ష సమావేశానికి వచ్చి సీమాంధ్రుల సమస్యలను విన్నవించాలన్నారు.
అక్కడి డిమాండ్లు ఏమిటో చెప్పాలని సూచించారు. రాజకీయ దివాళాకోరుతనానికి బాబు నిదర్శనమన్నారు. అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసి రాకపోవడమేమిటని ప్రశ్నించారు. మరో నెల రోజులు పొడిగిస్తే తెలంగాణ రాదని బాబు భావిస్తున్నారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం చంద్రబాబు రెంటికి చెడ్డ రేవడి అయ్యారని విమర్శించారు. కేబినెట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి రాష్ట్రపతి విభజనపై నిర్ణయం తీసుకుంటారని అపోహలు సృష్టించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications