ఏపి లో వైసిపి గెలుస్తుంది: జగన్..చంద్రబాబుకు షాక్..ఎలా : ఎన్నికల వేళ కేటీఆర్ సంచలనం..!
Recommended Video

ఏపి లో ఎన్నికల వేళ..టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక వైపు వైసిపి..టిఆర్ యస్ మధ్య సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబు విమర్శిస్తున్న వేళ..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపి లో జగన్ గెలుస్తారని చెబుతూనే..కేసీఆర్ అధ్యక్షతన ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ చేరుతారని చెప్పుకొచ్చారు. అదే సమయం లో చంద్రబాబు కు కేటీఆర్ షాక్ ఇచ్చారు..

ఏపిలో వైసిపి గెలుస్తుంది..
ఏసి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏపి రాజకీయాల పై ప్రస్తావించారు. జగన్ ఏపి ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన కేసీఆర్ అధ్యక్షతన ఉన్న ఫెడరల్ ఫ్రంట్ లోకి వస్తారని పేర్కొన్నారు. ఇక వైపు ఏపి ఎన్నికల ప్రచారంలో టిడిపి అధినేత చంద్ర బాబు పూర్తిగా సెంటిమెంట్ తో ప్రచారం సాగిస్తున్నారు. కేసీఆర్ ఏపికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని..తాను ఉంటే కేసీ ఆర్ ఆటలు సాగవని..అందుకే జగన్ ను సీయం చేయాలని భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. సెంటిమెంట్ పండిస్తూ తన కు ఓటు వేయాలని కోరుతున్నారు. జగన్ కు ఎన్నికల కోసం డబ్బులు ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి సమ యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల తో ఇప్పుడు టిడిపి మరింతగా విమర్శల వేడి పెంచే అవకాశం ఉంది.

చంద్రబాబుకు షాక్ ఇచ్చారు..
ఏపిలో తొలి విడతలోనే ఎన్నికలు నిర్వహించి తనను ఇబ్బంది పెడదామనుకుంటే..తాను ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకుంటానని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఏపిలో ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో ఏపిలో ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్ ను తీసుకొచ్చిన చంద్రబాబు..త్వరలోనే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సైతం వస్తారని టిడిపి అధినేత చెబుతున్నారు. అయితే, కేటీఆర్ మాత్రం మమతా బెనర్జీ, నవీన్, అఖిలేష్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ..అఖిలేష్ తమతో ఉన్నారని కేటీఆర్ ఇప్పుడు చెప్పటం వ్యూహాత్మకమా.. లేక వాస్తవాలే చెప్పా రా అనే చర్చ ఇప్పుడు టిడిపిలోనే మొదలైంది.

ఇక ప్రచారంలో ఈ వ్యాఖ్యలే కీలకంగా..
ఇప్పుడు ఏపి ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యలను టిడిపి తమ ప్రచారాస్త్రాలుగా మలచుకొనే అవకాశం ఉంది. జగన్ సోదరి షర్మిళ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. తాము టిఆర్‌యస్ ..బిజెపి తో తమకు ఎటువంటి పొత్తులు లేవని స్పష్టంగా చెప్పారు. జగన్ సైతం ఏపికి ఎవరైతే ప్రత్యేక హోదా కోసం సంతకం చేస్తారో వారికే తమ మద్దతు ఉంటుంద ని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యల తరువాత మమతా..అఖిలేష్ ఏపిలో టిడిపికి మద్దతుగా ప్రచారం లో పాల్గొంటారా లేదా అనే చర్చ మొదలైంది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications