వాట్సప్ ద్వారా ఫిర్యాదు: ‘స్మార్ట్ పోలీస్ టౌన్’ ప్రారంభించిన కెటిఆర్

జిల్లా ఎస్పీ నేతృత్వంలో స్థానిక డిఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న ప్రయోగాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన పోలీసులను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ‘స్మార్ట్ పోలీస్ టౌన్' కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్ అనంతరం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
పోలీసులు కూడా సమాజంలో ఒక భాగమని, వారిపై బాధ్యత ఉందని, నేరాలను నియంత్రించడానికి నేర రహిత గ్రామాల గుర్తింపునకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీసులకు అధునాతన వాహనాలు, సాంకేతిక పరికరాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వివరించారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతటా దీనిని విస్తరించాలని సంకల్పించారన్నారు. ఈమేరకు తగిన టెక్నాలజీ సహకారంతో జిల్లా ఎస్పీ సిరిసిల్లలో ‘స్మార్ట్ పోలీస్ టౌన్' ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కూడళ్ళలో 44 నిఘా కెమెరాలు ఏర్పాటు చేయగా, దీని కంట్రోలు రూంను పోలీస్ స్టేషన్‌లో మంత్రి ప్రారంభించారు.
ఈ కెమెరాలు అందించే దృశ్యాలను ఇక్కడ గమనిస్తూంటారని, ఎక్కడ ఏమి జరుగుతుందో వెంటనే తెలిసి పోతుందని చెప్పారు. అలాగే ‘ఈ' స్వీకార్ పేరుతో రిసెప్షన్ సెంటర్‌ను మంత్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రారంభించారు. ప్రజలు ఇచ్చే అన్ని ఫిర్యాదులు వెంటనే రికార్డు అవుతాయని, అలాగే ప్రజలు ఎక్కడి నుండైనా వాట్సప్ ద్వారా ఫిర్యాదును కానీ, ఫోటోలను కానీ పంపవచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications