చిచ్చుకే వైయస్ జగన్ హైదరాబాద్ సభ: కెటిఆర్ ఫైర్
కరీంనగర్/ హైదరాబాద్ : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభతో చిచ్చు పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి యత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.
సొంత పార్టీ నాయకులకు సమన్యాయం చేయలేని జగన్ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హైరాబాద్‌లో రెచ్చగొట్టే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఆర్టికల్ 4 కింద 371డీ విభజనకు అడ్డంకి కాదని, విభజన సవరణ ఆర్టికల్ 4 కింద జరుగుతందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. 371డీపై టీఆర్ఎస్‌కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. 371డీని సీమాంధ్ర నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని వినోద్ మండిపడ్డారు.
సమైక్య ఉద్యమాన్ని కొనసాగించడదానికి తమ పార్ట సమాయత్తమవుతోందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పా్రటీ త్రిపక్ష ఒప్పందాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన శుక్రవారం అనంతపురంలో అన్నారు.












Click it and Unblock the Notifications