చంద్రబాబు జైలుకు వెళ్లడంపై టీడీపీ నేత సంచలన కామెంట్స్
టీడీపీలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఓ టీడీపీ నేత సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ చేశారు.కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
జగన్ హయాంలో టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు, జైలుకు వెళ్లిన నాయకులను పక్కన పెడుతున్నారని తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం రోడ్డుపై పోరాడినోళ్లు, ఆర్థికంగా నష్టపోయినోళ్లు ఇప్పటికీ అలానే ఉన్నారని ఆయన తెలిపారు. అధికారం కోసం ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వైసీపీ వాళ్లకి పెద్దపీట వేస్తున్నారని తిక్కారెడ్డి చెప్పుకొచ్చారు. దీని కోసమేనా లోకేశ్ పాదయాత్ర, చంద్రబాబు జైలుకు వెళ్లిందంటూ నిలదీశారు. పార్టీ కార్యకర్తల దగ్గరే టీడీపీ నాయకులు లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

కర్నూలు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జిలుగా చెప్పుకుంటున్న నేతలు పార్టీ ఓడిపోయినప్పుడు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.పార్టీ గెలిచిన తర్వాత అందరూ నాయకులే అంటూ తిక్కారెడ్డి సెటైర్లు వేశారు. మన కార్యకర్తల దగ్గర మనమే డబ్బు వసూలు చేస్తే ఎలా అంటూ తిక్కారెడ్డి వేసిన ప్రశ్నతో సమావేశంలో కలకలం రేగింది. లంచం ఎవడిస్తే వారికే పనులు చేస్తారా? పదవులు ఇస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి.












Click it and Unblock the Notifications