డిగ్గీతో కెవిపి మంతనాలు, చంద్రబాబుకు ఎర్రబెల్లి ఫిర్యాదు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు, కేంద్రమంత్రి జెడి శీలంలు మంగళవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెవిపి మాట్లాడుతూ... సమైక్య రాష్ట్రంలోనే పురోగతి ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని కోరారు.
బిజెపి కార్యాలయం ముట్టడి
సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరులో సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలంయ ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను, జెండాను చించి వేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

టిటిడిపి నేతల భేటీ
ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఇరు ప్రాంత నేతలతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంత్రుల బృందం(జివోఎం), అఖిల పక్షం అంశాల పైన చర్చించనున్నారు.
కాగా, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కేంద్రం, కాంగ్రెసు పార్టీ విభజనపై ఏకపక్షంగా ముందుకు వెళ్తోందని, దానిని ఆపాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బాబుకు టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు ఫిర్యాదు చేశారు. సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర గళం వినిపిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications