Lady Aghori Marriage: లేడీ అఘోరీని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి..! సంసార సుఖం లేకున్నా ఓకే ..!
గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న లేడీ అఘోరీ శ్రీనివాస్ మరో సంచలనం రేపాడు. గత నెలలో మంగళగిరి యువతి శ్రీవర్షిణితో పారిపోయిన అఘోరీ.. వివిధ రాష్ట్రాలు తిరుగుతూ తాజాగా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో యువతి తల్లితండ్రుల్ని మంగళగిరి నుంచి పిలిపించి వారికి ఆమెను అప్పగించారు. అయితే అఘోరీతో తనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిణి చావు కబురు చల్లగా చెప్పింది.
రెండు నెలల క్రితం మంగళగిరికి వచ్చిన అఘోరీ.. కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో ఆమెకు బట్టలు తీసుకెళ్లి ఇచ్చిన మంగళగిరి యువతి శ్రీవర్షిణి తమ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి వీరిద్దరి జీవితాలు మారిపోయాయి. గత నెలలో శ్రీవర్షిణిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరీ.. ఆమెను పూర్తిగా మార్చేసింది. దీంతో వీరిద్దరూ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే పెళ్లి చేసుకున్నారు.

వివిధ రాష్ట్రాలు తిరుగుతూ గుజరాత్ లో వీరిద్దరూ పట్టుబడటంతో పోలీసులు శ్రీవర్షిణి కుటుంబ సభ్యుల్ని పిలిపించి ఇంటికి పంపేశారు. అయితే తాజాగా ఓ టీవీ స్డూడియోలో దర్శనమిచ్చిన వర్షిణి అసలు విషయాలు బయటపెట్టింది. తన మనసుకు అఘోరీ నచ్చాడని, అందుకే తాళి కట్టించుకున్నానని వెల్లడించింది. అతను మగాడు కాకపోయినా, సంసార సుఖం ఇవ్వలేకపోయినా తన మనసులో అతనే భర్త అని తేల్చి చెప్పేసింది. దీంతో అంతా షాకయ్యారు.
అలాగే అఘోరీ కూడా పెళ్ళి అయ్యాక పది రోజులు వివిధ గుడులు దర్శనం చేసుకున్నట్లు తెలిపాడు. కాశీ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు వెల్లడించాడు. పోలీస్ స్టేషన్ లో చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని భార్యాభర్తల హక్కులు పొందుతామని కూడా ప్రకటన చేశేసాడు. మరోవైపు ఇంట్లో తల్లితో, తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూసానని, అందుకే అఘోరితో జీవితం నయం అనిపించిందని వర్షిణి చెప్పుకొస్తోంది. మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్న్నట్లు వెల్లడించింది. కావాలని తమ పెళ్ళి రహస్యంగా ఉంచామని, సమాజం కోసం తల్లీ బిడ్డా అని చెప్పుకున్నామని తెలిపింది.
తనకు సంసారం సుఖం తనకు అక్కరలేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని, అనాధ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి వెల్లడించింది. దీంతో వీరి వ్యవహారంలో తర్వాత ఏం జరగబోతోందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications