ఉమెన్స్ డే రోజే...ఎంఈవోని చెప్పుతో కొట్టిన లేడీ టీచర్
గుంటూరు జిల్లాలోని లింగాపూర్ స్కూల్‌లో 6 నెలల క్రితం ఇద్దరు టీచర్ల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం విషయం ఎంఈవో రామిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన విచారించి ఉమాదేవి అనే టీచర్‌ను సస్పెండ్ చేశారు. ఆ తరువాత ఉపాధ్యాయురాలు ఉమాదేవి ఎంఈవోపై ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 8 మహిళా దినోవ్సవం సందర్భంగా అమరావతిలో ప్రత్యేక కార్యక్రమానికి ఎంఈవో రామిరెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఆయన రావడం గమనించిన లేడీ టీచర్ ఉమాదేవి కార్యక్రమం జరుగుతుండగా ఎంఈవో రామిరెడ్డిపై హఠాత్తుగా దాడి చేసి చెప్పుతో కొట్టారు. ఉపాధ్యాయురాలు ఉమాదేవి అనూహ్య ప్రవర్తనతో తోటి ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. సస్పెండ్ చేసినందుకు చెప్పుతో కొట్టడం దిగ్బ్రాంతి చెందారు.
తనను చెప్పుతో కొట్టిన లేడీ టీచర్ ఉమాదేవిపై ఎంఈవో రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.













Click it and Unblock the Notifications